రేవంత్ పాటకు చిందులేసిన ప్రియాంక.. వీడియో వైరల్!

తెలంగాణలో పర్యటిస్తున్నారు కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ. ఖమ్మంలోని పాలేరులో ప్రచారంలో భాగంగా టీపీసీసీ ఛీఫ్ రేవంత్ రెడ్డి పాటకు ప్రియాంక గాంధీ స్టెప్పులేశారు. దీనికి సంబంధించిన వీడియోను కాంగ్రెస్ శ్రేణులు షేర్ చేస్తున్నారు.

రేవంత్ పాటకు చిందులేసిన ప్రియాంక.. వీడియో వైరల్!
New Update

Telangana Elections 2023: తెలంగాణ ఎన్నికల సమయం దగ్గరపడడంతో అన్ని పార్టీల నేతలు ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. ఒకరిని మించి ఒకరు ప్రచారాల్లో దూసుకుపోతున్నారు. తాజాగా ఎన్నికల ప్రచారంలో భాగంగా తెలంగాణలో పర్యటిస్తున్నారు కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ (Priyanka Gandhi). ఈ క్రమంలో ఈరోజు ఖమ్మం (Khammam) జిల్లాలో పర్యటించిన ప్రియాంక గాంధీ టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి (Revanth Reddy) పాటకు డ్యాన్స్ చేశారు. ప్రస్తతం దీనికి సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో తెగ వైరల్ చేస్తున్నారు కాంగ్రెస్ శ్రేణులు.

ALSO READ: పవన్ కళ్యాణ్ కంటే బర్రెలక్క బెటర్.. RGV ట్వీట్ వైరల్!

పాలేరులో (Paleru) కాంగ్రెస్‌ రోడ్‌ షో.. ప్రియాంక గాంధీ మాట్లాడుతూ.. తెలంగాణ ఆడబిడ్డలు, యువత ఈ రాష్ట్రాన్ని సాధించారని అన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌ గాలి వీస్తుందని తెలిపారు. మార్పు రావాలి.. కాంగ్రెస్ రావాలి అంటూ స్లొగన్స్ ఇచ్చారు. కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే యువతకు ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు.

కాంగ్రెస్ (Congress) అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే ఆరు గ్యారెంటీలను అమలు చేస్తామని అన్నారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కాంగ్రెస్ గెలిచిన రోజు నుంచే అమల్లోకి వస్తుందని తెలిపారు. కాంగ్రెస్ కి వస్తున్న ఆదరణ చూసి ఓర్వలేక కాంగ్రెస్ నేతలపై ఈడీ, ఐటీ రైడ్స్ చూపిస్తున్నారని మండిపడ్డారు.

పెరిగిన నిత్యావసరాల ధరలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని.. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే నిత్యావసర వస్తువుల ధరలను తగ్గిస్తామని వెల్లడించారు. గ్యాస్ సిలిండర్ ను కేవలం రూ.500కే అందిస్తామని.. మహిళలకు నెలకు రూ.2500 అందిస్తామని తెలిపారు. మేము చెప్పే వాళ్ళం కాదు చేసేవాళ్ళం అని అన్నారు. తెలంగాణ ఇస్తా అని చెప్పిన సోనియా గాంధీ.. తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిందని గుర్తు చేశారు.

ALSO READ: రైతులకు రూ.300కే యూరియా.. కామారెడ్డిలో మోదీ!

#congress #telangana-elections-2023 #telugu-latest-news #viral-videos #priyanka-gandhi-dance
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe