Telangana Elections 2023: ఎన్నికల ప్రచారంలో భాగంగా తెలంగాణలో పర్యటిస్తున్నారు ప్రధాని మోదీ (PM Modi). ఈ పర్యటనలో బీఆర్ఎస్ (BRS), కాంగ్రెస్ (Congress Party) పార్టీలకు విమర్శల దాడికి దిగారు ప్రధాని. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు రెండు ఒకటే అని ఆరోపించారు. తెలంగాణ ప్రజలు మార్పు కోరుకుంటున్నారని అన్నారు. తెలంగాణలో బీజేపీ (BJP) అధికారంలో రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.
నిర్మల్‌లో (Nirmal) బీజేపీ సకల జనుల విజయ సంకల్ప సభలో మోదీ పాల్గొన్నారు. మోదీ మాట్లాడుతూ.. తెలంగాణలో సకల జనుల ప్రభుత్వం వస్తుందని అన్నారు. పదేళ్లుగా తెలంగాణకు బీఆర్ఎస్ చేసింది ఏంలేదని పేర్కొన్నారు. సకల జనుల సౌభాగ్య తెలంగాణ బీజేపీతోనే సాధ్యమని తెలిపారు. తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం రాబోతుందని పేర్కొన్నారు. సర్కారు స్టీరింగ్‌ను కేసీఆర్ వేరే పార్టీ చేతుల్లో పెట్టారని విమర్శించారు.
ALSO READ: పెన్షన్ రూ.5000.. కేసీఆర్ సంచలన ప్రకటన!
పసుపు రైతుల కోసం తెలంగాణలో పసుపు బోర్డు ఏర్పాటు చేస్తున్నామని నరేంద్ర మోదీ తెలిపారు. బీజేపీ ప్రభుత్వం వస్తే ఆర్మూర్ పసుపునకు జీఐ ట్యాగ్ వచ్చేలా కృషి చేస్తామని పేర్కొన్నారు. బీజేపీ ప్రభుత్వం వస్తే నిజామాబాద్‌ను పసుపు నగరంగా ప్రకటిస్తాం అని హామీ ఇచ్చారు.
ప్రపంచం మొత్తం మేక్ ఇన్ ఇండియా గురించే మాట్లాడుతుందని హర్షం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతలు మాత్రం మేక్ ఇన్ ఇండియా గురించి మాట్లాడరు అని మండిపడ్డారు. మరో ఐదేళ్ల పాటు పేదలకు ఉచితంగా బియ్యం పంపిణీ చేస్తామని ప్రకటించారు. బీజేపీ పాలిత రాష్ట్రాలు పెట్రోల్, డీజిల్‌పై వ్యాట్ తగ్గించాయని.. తెలంగాణలో కూడా బీజేపీ అధికారంలోకి వస్తే పెట్రోల్, డీజిల్ (Petrol, Diesel Prices) ధరలు తగ్గుతాయని అన్నారు.
ALSO READ: కొత్త రేషన్ కార్డులపై కేటీఆర్ సంచలన ప్రకటన!