/rtv/media/post_attachments/wp-content/uploads/2023/11/Suryapeta-Power-Fans--jpg.webp)
ఈ రోజు సూర్యాపేట జిల్లా కేంద్రంలో జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ (Pawan Kalyan) బీజేపీ అభ్యర్థి సంకినేని వెంకటేశ్వరరావు (Sankineni Venkateshwar Rao) తరఫున ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వహించిన రోడ్ షోకు బీజేపీ శ్రేణులతో పాటు, పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ భారీగా తరలివచ్చారు. పవన్ మాట్లాడుతున్నంత సేపు ఆయన ఫ్యాన్స్ రచ్చ రచ్చ చేశారు. ఆయనపై పూలు చల్లి తమ అభిమానాన్ని చాటారు. సీఎం.. సీఎం అంటూ నినాదాలు చేశారు. పవన్ కల్యాణ్ కూడా ప్రచార రథం చుట్టూ తిరుగుతూ తన స్పీచ్ మధ్యలో అనేక సార్లు అభివాదం చేశారు. మీ ప్రేమ, స్వాగతాన్ని మర్చిపోలేనని భావోద్వేగానికి గురయ్యారు. అభిమానులు ఆత్మీయంగా అందించిన ఖడ్గాన్ని తీసుకుని వారిలో ఆనందాన్ని నింపారు. ఓ దశలో పవన్ ఫ్యాన్స్ ప్రచార రథాన్ని ఎక్కేందుకు ప్రయత్నించగా.. వారిని వారించడం పోలీసులకు కష్టంగా మారింది.
ఇది కూడా చదవండి: Telangana Elections: రైతుల చుట్టే తెలంగాణ ఎలక్షన్స్.. ఎవరికి పట్టం కట్టేనో మరి..!
పవర్ స్టార్ ప్రసంగం కూడా ఆద్యాంతం ఉత్సాహంగా సాగింది. బండెనుక బండి కట్టి అంటూ.. గద్దర్ పాట పడి ఫ్యాన్స్ లో జోష్ పెంచారు పవర్ స్టార్. ఆ పాటతో తాను ప్రభావితం అయ్యానన్నారు. తమ్ముడు ఘన విజయం తర్వాత ఆ డబ్బులతో నల్గొండ జిల్లాలో ఫ్లోరైడ్ బాధిత గ్రామాన్ని దత్తత తీసుకోవాలని తాను భావించానున్నారు. ఆనాడు ఉన్న రాజకీయ నాయకులు తనను అడ్డుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో రజకీయ శక్తిగా మారితేనే ప్రజలకు మేలు చేయవచ్చన్న భావన తనకు ఆ రోజు కలిగిందన్నారు.
పవన్ మాట్లాతుండగా ఓ అభిమాని ఎర్ర కండువాను కింద నుంచి అందించగా.. ఎరుపు విప్లవానికి చిహ్నం అని అన్నారు. కాషాయం సనాతన ధర్మానికి ప్రతీక అని అన్నారు. అందరినీ సమానంగా చూసే దృష్టి ప్రధాని మోదీదని అన్నారు. తెలంగాణలో డబుల్ ఇంజన్ సర్కార్ రావాలని ఆకాంక్షించారు. బీజేపీ, జనసేన అభ్యర్థులను గెలిపించాలని కోరారు. బీసీ సీఎంను ప్రకటించిన బీజేపీకి తన సంపూర్ణ మద్దతు ఉంటుందని మరో సారి స్పష్టం చేశారు పవర్ స్టార్.