Telangana Elections 2023: తెలంగాణలో ఎన్నికలకు మరో 5రోజుల సమయం మాత్రమే మిగిలి ఉంది. ఈ నేపథ్యంలో అన్నీ పార్టీలు ప్రచారాల్లో జోరు పెంచాయి. జాతీయ పార్టీలైన బీజేపీ (BJP), కాంగ్రెస్ (Congress) పార్టీలు తమ అగ్రనేతలను తెలంగాణలో ప్రచారానికి దించాయి. ఈ నేపథ్యంలో బీజేపీ తరఫున మోదీ, అమిత్ షా, సీఎం యోగి, మిగతా కేంద్ర మంత్రులు తెలంగాణలో పర్యటిస్తున్నారు. అలాగే కాంగ్రెస్ లో డీకే శివకుమార్, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, ఖర్గే తదితర నేతలు పర్యటన చేస్తున్నారు.
ALSO READ: తెలంగాణ రైతులకు అలర్ట్.. ఆ ఒక్కరోజే అందరి ఖాతాల్లోకి రైతుబంధు?
ఈరోజు బన్సీలాల్‌పేటలో కాంగ్రెస్ సభలో పాల్గొన్నారు కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే. ఈ నేపథ్యంలో ఆయన మాటాడుతూ బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలపై తీవ్ర విమర్శలు చేశారు. పేదల ఖాతాల్లో ప్రధాని మోదీ రూ.15 లక్షలు వేస్తామన్నారు.. వేశారా? అని తెలంగాణ ప్రజలను ప్రశ్నించారు.
రైతు ఆదాయం రెట్టింపు చేస్తామని మోదీ చెప్పారు.. చేశారా? అంటూ మండిపడ్డారు. 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని మోదీ చెప్పారు.. ఇచ్చారా? అని ఫైర్ అయ్యారు. ఆప్ సర్కారుతో కేసీఆర్ కుమ్మక్కయ్యారని ఖర్గే ఆరోపించారు. మోదీ, కేసీఆర్.. ఇద్దరూ అబద్ధాలే చెబుతున్నారని విమర్శించారు.
హైదరాబాద్‌లో నెహ్రూ కాలంలోనే అనేక పరిశ్రమలు వచ్చాయని ఖర్గే అన్నారు. బీహెచ్‌ఈఎల్ వంటి అనేక పరిశ్రమలు కాంగ్రెస్ హయాంలో వచ్చాయని పేర్కొన్నారు. కాంగ్రెస్ తెచ్చిన పరిశ్రమలను మోదీ సర్కారు అమ్ముకుంటోందని విమర్శించారు. ప్రభుత్వ రంగంలో కాంగ్రెస్ గతంలో ఎన్నో ఉద్యోగాలు ఇచ్చిందని తెలిపారు.
ALSO READ: రాహుల్ గాంధీకి వ్యతిరేకంగా నిజామాబాద్ లో పోస్టర్లు