ఓటు వెయ్యకపోతే సచ్చిపోతా.. కౌశిక్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు
కమలాపూర్‌లో ఎన్నికల ప్రచారంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి కౌశిక్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తనకు ఓటు వేయకపోతే కుటుంబంతో కలిసి ఆత్మహత్య చేసుకుంటానని అన్నారు. కౌశిక్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారాయి.
Koushik Reddy: ఎల్లుండి తెలంగాణలో ఎన్నికలు జరగనున్నాయి. ప్రచారాలు చేసుకొనేందుకు మరికొన్ని గంటలే సమయం మిగిలి ఉంది. ఈ నేపథ్యంలో హుజురాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి ఎన్నికల ప్రచారంలో చేసిన వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారాయి.
కమలాపూర్‌లో ఎన్నికల ప్రచారంలో ఉన్న కౌశిక్ రెడ్డి మాట్లాడుతూ.. తనను గెలిపించకపోతే సామూహిక ఆత్మహత్యలు చేసుకుంటామని సంచలన వ్యాఖ్యలు చేశారు. మీరు ఓటేసి దీవిస్తే 4వ తేదీ నా జైత్రయాత్ర.. గెలిపించకుంటే మా కుటుంబ సభ్యుల శవయాత్ర అని అన్నారు. మా కుటుంబ సభ్యులు ముగ్గురం ఆత్మహత్య చేసుకుంటామని భార్య, కూతురు ముందే కౌశిక్ ఈ వ్యాఖ్యలు చేశారు.
హుజురాబాద్ నుంచి బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఈటల రాజేందర్ ఉన్నారు. కాంగ్రెస్ తరఫున ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రణవ్ బాబు బరిలోకి దిగారు. పాడి కౌశిక్ రెడ్డి తనకు ఓటు వెయ్యకపోతే తన కుటుంబంతో కలిసి ఆత్మహత్య చేసుకుంటామని చేసిన వ్యాఖ్యలు హుజురాబాద్ ప్రజలపై ప్రభావం చూపుతుందో లేదో అనేది డిసెంబర్ 3వ తేదీ వరకు వేచి చూడాలి.

Also Read: కేసీఆర్ హ్యాట్రిక్ సీఎం అవ్వడం పక్క.. కేటీఆర్ ట్వీట్!