Barrelakka: కొల్లాపూర్ స్వతంత్ర అభ్యర్థి బర్రెలక్క అలియాస్ శిరీష్ అజ్ఞాతంలోకి వెళ్లింది. పోలింగ్ రోజున ఓటు వేసిన వెళ్లిన శిరీష.. ఆ తరువాత బయట కనిపించలేదు. గురువారం పోలింగ్‌లో తన ఓటును వినియోగించుకున్న కొన్ని గంటల తరువాత నుంచి శిరీష కనిపించుకుండా పోయింది. ఎవరి కాల్స్ ఆన్సర్ చేయడం లేదు. పోలింగ్ తర్వాత RTV తో మాట్లాడిన శిరీష (Sirisha).. తన తండ్రి గురించి మాట్లాడుతూ భావోద్వేగానికి లోనైంది. ఆ తరువాత ఎవరికీ కనిపించకుండా పోయింది శిరీష.
అజ్ఞాతంలోకి వెళ్లిన బర్రెలక్క ఇప్పుడు ఎక్కడుంది? ఆమెకు ఏమైంది? శిరీష ఎందుకు అజ్ఞాతంలోకి వెళ్ళింది? శిరీషను తెర వెనక ఉండి నడిపిస్తున్నది ఎవరు? శిరీష తరువాతి ప్లాన్ ఏంటి? శిరీష మిస్ అయినప్పటి నుంచి ఇవే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. అయితే, ఎన్నికల ఫలితాలు వచ్చే వరకు ఎవరికీ కనిపించద్దు, ఎవరితోనూ మాట్లాడవద్దని శిరీషకు కొందరు సూచించినట్లు సమాచారం అందుతోంది. ఈ కారణంగానే ఆమె అజ్ఞాతంలోకి వెళ్లినట్లు తెలుస్తోంది. ఎన్నికల రణరంగంలో తెగించి కొట్లాడిన శిరీష.. పోలింగ్ పూర్తయిన తరువాత ఎందుకు తెర వెనక్కి వెళ్లింది? ఓటింగ్ ముగిశాక కనిపించకుండా వెళ్లడానికి కారణం ఏంటి? అనేది ప్రశ్నార్థకంగా మారింది. శిరీష నెక్ట్స్ ప్లాన్ ఏంటి? అనేది మాత్రం ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది.
Also Read:
‘అధికారం మనదే’.. కేసీఆర్ అధ్యక్షతన కేబినెట్ భేటీ
ఎన్నికల్లో ఇద్దరికీ సమానంగా ఓట్లు వస్తే ఏమవుతుంది? రాజ్యాంగం ఏమి చెబుతోంది