Kishan Reddy: వారి హామీలు ఫేక్‌.. 3న సర్వేలన్నీ చిత్తు: కిషన్ రెడ్డి

సర్వేలను చిత్తు చేస్తూ డిసెంబర్ 3న బీజేపీ గెలవబోతుందని ఆ పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. బీజేపీ మేనిఫెస్టోపై ప్రజలు సానుకూలంగా స్పందిస్తున్నారన్నారు. బీసీ ముఖ్యమంత్రి హామీ ప్రజలను ఆకర్షిస్తోందన్నారు కిషన్ రెడ్డి.

Kishan Reddy: రేవంత్ రెడ్డికి ఆ శక్తి లేదు.. కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు
New Update

బీఆర్‌ఎస్‌ (BRS), కాంగ్రెస్‌లు (Congress) చెప్తున్నవన్నీ ఫేక్‌ హామీలని, బీజేపీ మేనిఫెస్టో పట్ల ప్రజలు సానుకూలంగా స్పందిస్తున్నారని, బీసీ ముఖ్యమంత్రి హామీ అందరినీ ఆకర్షిస్తోందని ఆ పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి (Kishan Reddy) అన్నారు. నాంపల్లి బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన సోమవారం మీడియాతో మాట్లాడుతూ... యువత, మహిళలు ప్రధాని మోదీకి అండగా నిలబడుతున్నారన్నారు. బీజేపీ, కాంగ్రెస్ కుటుంబాల నుంచి వచ్చినవారు కూడా బీజేపీకి జైకొడుతున్నట్లు చెప్పారు. ఒక మాట చెబితే దానికి కట్టుబడి ఉండేది బీజేపీ మాత్రమేననే అభిప్రాయం అందరిలోనూ ఉందన్నారు. ఇతర పార్టీల నేతల మాటలు కోటలు దాటుతాయని, కానీ చేసే పని మాత్రం ప్రగతి భవన్, గాంధీ భవన్ కూడా దాటవని ఎద్దేవా చేశారు. ఏడు దశాబ్దాలుగా కాంగ్రెస్ ఎన్నో హామీలు ఇచ్చిందని, కానీ ప్రజలకు విషాదమే మిగిల్చిందని ధ్వజమెత్తారు.
ఇది కూడా చదవండి: CM KCR: కోమటిరెడ్డి నల్గొండకు ఏం చేసిండు?.. కాంగ్రెస్ వస్తే ‘భూమేత’: నల్గొండ మీటింగ్ లో కేసీఆర్

కాంగ్రెస్ కారణంగా తెలంగాణ అనేక రకాలుగా నష్టపోయిందన్నారు. తెలంగాణ ఉద్యమంలో తొలి విడతలో 369 మంది, మలివిడతలో 1200 మందిని కాంగ్రెస్ బలితీసుకుందని గుర్తు చేశారు. ఇప్పుడు కాంగ్రెస్ ఇస్తోన్న ఫేక్ గ్యారెంటీలను తెలంగాణ ప్రజలు నమ్మడం లేదన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ ఆచరణ సాధ్యం కానీ హామీలు ఇస్తున్నాయని మండిపడ్డారు. బడుగు బలహీనవర్గాలు, షెడ్యూల్ తెగల ప్రజలు బీజేపీని విశేషంగా ఆదరిస్తున్నారన్నారు.

చాలా అసెంబ్లీ నియోజకవర్గాల్లో బీజేపీ ముందంజలో ఉందని, తెలంగాణలో ఒక నిశ్శబ్ద విప్లవం కనిపిస్తోందని చెప్పారు. బీఆర్ఎస్‌కు వ్యతిరేకంగా ఓటు వేయాలని ప్రజలు నిర్ణయించుకున్నారని, బీజేపీని ప్రత్యామ్నాయంగా భావిస్తున్నారన్నారు. ఇన్నాళ్లు పోలీసులకు భయపడ్డారని, కానీ ఎలాగూ కేసీఆర్ దిగిపోతున్నాడని అర్థమై, ఇప్పుడు నిలదీస్తున్నట్లు చెప్పారు. కొన్ని సర్వే సంస్థలు దొంగ లీకేజీలు ఇస్తున్నప్పటికీ బీజేపీ... పార్టీ అభ్యర్థులకు ఏమాత్రం ఆదరణ తగ్గడం లేదన్నారు.

#bjp #telangana-elections-2023 #g-kishan-reddy
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe