రెండు దశాబ్దాలకు పైగా ఎమ్మెల్యేగా ఉన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి (Komatireddy Venkatreddy) ఉమ్మడి నల్గొండ జిల్లాకు ఏం చేశారంటూ ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR) ప్రశ్నించారు. సోమవారం నల్గొండలో బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… కోమటిరెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు నల్గొండ ఎలా ఉంది? మంచి నీళ్ళు వచ్చాయా? కరెంట్ మాటేమిటి? అసలు ఏ పనులైనా చేశాడా? మరి అదే నల్గొండ ఇప్పుడు ఎలా ఉంది? ఒక్కసారి ఆలోచించి ఓటు వేయాలని సభకు వచ్చిన వారిని ఉద్దేశించి అన్నారు. గత పదేళ్లలోనే నల్గొండ పట్టణం, నియోజకవర్గం అభివృద్ధి చెందిన విషయం గుర్తించాలన్నారు.
ఇది కూడా చదవండి: TS Elections: కాంగ్రెస్ కు చంద్రబాబు సపోర్ట్.. రేణుకా చౌదరి సంచలన వ్యాఖ్యలు
CM KCR: కోమటిరెడ్డి నల్గొండకు ఏం చేసిండు?.. కాంగ్రెస్ వస్తే ‘భూమేత’: నల్గొండ మీటింగ్ లో కేసీఆర్
ఈ రోజు నల్లగొండలో నిర్వహించిన బీఆర్ఎస్ ఎన్నికల ప్రచార సభలో సీఎం కేసీఆర్ కోమటరెడ్డి వెంకట్ రెడ్డి టార్గెట్ గా విమర్శలు చేశారు. నల్గొండకు ఆయన చేసిందేమీ లేదంటూ ధ్వజమెత్తారు. ధరణికి బదులుగా కాంగ్రెస్ తెస్తా అనేది 'భూమేత' పోర్టల్ అంటూ సెటైర్లు వేశారు.

Translate this News: