అవినీతి పార్టీలు ఓడిపోవాలి.. కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు!

బీజేపీకి రోజు రోజుకు ఆదరణ పెరిగింది.. ప్రజల నుంచి విశేష స్పందన వచ్చిందని పేర్కొన్నారు కిషన్ రెడ్డి. మజ్లిస్‌ పార్టీని పెంచి పోషింది కాంగ్రెస్సే అని ఫైర్ అయ్యారు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తుందని అన్నారు. అవినీతి పార్టీలు ఓడిపోవాలని పేర్కొన్నారు.

New Update
Kishan Reddy: రేవంత్ రెడ్డికి ఆ శక్తి లేదు.. కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు

Telangana Elections 2023: ఎన్నికల వేళ తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి (Kishan Reddy) కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ప్రజాస్వామ్యానికి సంబంధించిన పండగ 30వ తేదీన జరగబోతుందని అన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు గెలవాలి.. ప్రజాస్వామ్యం గెలవాలని పిలుపునిచ్చారు. కుటుంబ, అవినీతి పార్టీలకు ప్రజలు బుద్ది చెప్పనున్నారని అన్నారు. బీఆర్ఎస్ (BRS)  చేతిలో మరోసారి పడి మోసపోవద్దని ప్రజలను హెచ్చరించారు.

నక్కలాగా కూర్చుని వేచి చూస్తున్న కాంగ్రెస్ (Congress) మాయలో పడొద్దు అని ప్రజలను కోరారు. బీజేపీని (BJP) ఆశీర్వదించాల్సిందిగా తెలంగాణ ప్రజానీకానికి విజ్ఞప్తి చేస్తున్నామని అన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలను ప్రజలు బహిష్కరించి తగిన బుద్ది చెప్పాలని పేర్కొన్నారు. బీజేపీపైన పెద్ద ఎత్తున విష ప్రచారం చేసినా.. ప్రజలు గుర్తించారు అని తెలిపారు.

ALSO READ: మందు బాబులకు ALERT.. నేటి నుండి వైన్స్ బంద్!

బీజేపీకి రోజు రోజుకు ఆదరణ పెరిగింది.. ప్రజల నుంచి విశేష స్పందన వచ్చిందని అన్నారు. ఎవరికి బీ- టీమ్‌గా ప్రజలు గుర్తించలేదు.. ఏ టీమ్ గానే ప్రజలు ఎన్నికల ప్రచారంలో ఆదరించారు అని తెలిపారు. మోదీ (Modi) రోడ్ షోకు ప్రజలు ఘన స్వాగతం పలికారు.. నిజమైన ప్రజాస్వామ్యం కనిపించిందని హర్షం వ్యక్తం చేశారు.

మజ్లిస్.. బీజేపీ కనుసన్నల్లో పనిచేస్తుందా? రాహుల్ గాంధీ కనీసం వచ్చేముందైనా.. వాస్తవాలు తెలుసుకోవాలి కాదా? మజ్లిస్ ను పెంచిపోషించింది మీ కుటుంబం అని మండిపడ్డారు. ముస్లింలీగ్ ను ఈ దేశంలో పెంచి పోషించారో.. ఎవరి కారణంగా దేశ విభజన జరిగిందో.. దానికి మీ కుటుంబమే కారణం కాదా? అని రాహుల్ (Rahul Gandhi), ప్రియంకాలను (Priyanka Gandhi) నిలదీశారు.

కాంగ్రెస్ పార్టీ అంతర్గత రాజకీయాల్లో భాగంగా.. చెన్నారెడ్డిని గద్దె దించేందుకు మజ్లిస్ ను ఎగదోసి భాగ్యనరగంలో మతకల్లోలలు చేసింది కాంగ్రెస్ కాదా? అని ప్రశ్నించారు. మైనారిటీ వర్గానికి చెందిన ఆడబిడ్డలు కూడా బీజేపీని ఆదరిస్తున్నారని అన్నారు. పాతచింతకాయ పచ్చడిలాగా.. అరిగిపోయిన గ్రామఫోన్ రికార్డులాగా.. రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలు అవే అసత్యాలు మాట్లాడారు అని విమర్శించారు. వారికి మజ్లిస్ తెలీదు, రాజకీయాలు తెలియదని మండిపడ్డారు. వారిద్దరికీ కనీస రాజకీయ అవగాహన కూడా లేదు అంటూ ఫైర్ అయ్యారు.

ALSO READ: ఓటు వెయ్యకపోతే సచ్చిపోతా.. కౌశిక్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు

Advertisment
తాజా కథనాలు