TS Elections 2023: తెలంగాణ పేపర్లలో కర్ణాటక యాడ్స్.. కాంగ్రెస్, బీఆర్‌ఎస్ మధ్య కొత్త వార్! తెలంగాణ రాజకీయం అసలసిసలైన చదరంగాన్ని తలపిస్తోంది. జాతీయ, ప్రాంతీయ పత్రికల్లో కర్ణాటక ప్రభుత్వం ప్రకటనలు ఇచ్చింది. అయితే ఆ ప్రకటనలలోని లబ్ధిదారులు ఫేక్ అని బీఆర్‌ఎస్ విమర్శలు గుప్పిస్తోంది. By Trinath 25 Nov 2023 in Latest News In Telugu తెలంగాణ New Update షేర్ చేయండి TELANGANA ELECTIONS 2023: ఉదయం లేవగానే వాష్‌రూమ్‌కి వెళ్లాడు రాహుల్. తర్వాత బ్రష్ చేసి కాఫీ తాగుతూ న్యూస్ పేపర్ పెట్టి ఉన్న టేబుల్ వద్దకు వెళ్లాడు. రోజూ కాఫీ తాగుతూ పేపర్ చదివే అలవాటు రాహుల్‌ది. ఎన్నికలు కావడంతో పేపర్‌తో తొలి పేజీ ఎలా ఉంటుందోనన్న ఆసక్తి రోజులానే అతడిలో కనిపించింది. ఇవాళ కూడా ఏదో పెద్ద న్యూసే ఉంటుందని పేపర్ మడత తీశాడు. పేపర్ ఫ్రంట్ పేజీలో రేవంత్ రెడ్డినో, కేసీఆరో ఉంటండానుకుంటే సిద్ధరామయ్య కనిపించాడు. ఇదేంటి.. కర్ణాటక పేపర్ వేశాడా తెలియకా అని కంగారుపడ్డాడు. ఇంతలోనే అక్షరాలు తెలుగులోనే ఉన్నాయి కదా అని రియలైజ్ అయ్యాడు. ఇది పేపర్‌కు వచ్చిన యాడ్ అని అర్థమైంది. పేపర్ ఫ్రంట్ పేజీపై నుంచి కింది వరకు కర్ణాటక(Karnataka) ముఖాలే కనిపిస్తున్నాయి. కాంగ్రెస్ ఆరు గ్యారెంటీల పథకం గురించి అందులో రాసి ఉంది. లబ్ధిదారుల మాటలు కూడా ప్రస్తావించారు. అయితే అందులో ఓ లబ్ధిదారుడిని ఎక్కడో చూసినట్టు అనిపించింది. సరేలే వాడెవడో మనకేందులే అని నెక్ట్స్ పేజీలోకి వెళ్లిపోయాడు. పేపర్ చదివేసిన తర్వాత బాత్ చేసి వచ్చాడు. టిఫిన్ చేస్తూ ట్విట్టర్ ఓపెన్ చేశాడు. TSMDC చైర్మన్ క్రిషాంక్ చేసిన ఓ ట్వీట్ చూసి కంగుతిన్నాడు. ఇంతకి క్రిషాంక్(Krishank) ఏం ట్వీట్ చేశాడు? తెలంగాణ కాంగ్రెస్ నేతల ఖాతాల్లో పడకుండా జాగ్రత్తలు: ఎత్తులకు పై ఎత్తులకు వెయ్యడం రాజకీయ పార్టీలకు కొట్టిన పిండి. డబ్బులను ఎలా తెలివిగా వాడుకోవాలో ఆర్థికవేత్తల కంటే రాజకీయ నాయకులే బాగా చెప్పగలరు.. అదే సమయంలో డబ్బులు ఎలా పొగొట్టుకోవచ్చో కూడా వారినే చూస్తేనే అర్థమవుతుంది. తెలంగాణలో ఎన్నికలకు సమయం ముంచుకొస్తు్‌న్న వేళ ప్రధాన పార్టీలు తమ బుర్రకు మరింత పదును పెడుతున్నాయి. ముఖ్యంగా బీఆర్‌ఎస్(BRS), కాంగ్రెస్(Congress) పార్టీలు సోషల్‌మీడియాతో పాటు మెయిన్‌స్ట్రీమ్ మీడియానూ తెలివిగా యూజ్ చేసుకుంటున్నాయి. తెలంగాణలోని ప్రధాన న్యూస్ పేపర్లలో కర్ణాటక కాంగ్రెస్ యాడ్స్ ఇస్తోంది. ఆరు గ్యారెంటీలను కర్ణాటకలో అమలు చేస్తున్నామని లబ్ధిదారుల మాటలతో సహా ప్రకటనలు ఇస్తోంది. కర్ణాటకలో ఆరు గ్యారెంటీలు అమలు కావడంలేదని ఓవైపు బీఆర్‌ఎస్ విమర్శలు గుప్పిస్తుంటే.. అందుకు బదులుగా నేరుగా సిద్ధరామయ్య ఫొటోలతో యాడ్స్‌ను ప్రింట్ చేయిస్తోంది. ప్రకటనల ఖర్చు తెలంగాణ కాంగ్రెస్ నేతల ఖాతాల్లో పడకుండా జాగ్రత్తలు తీసుకుంటోంది. కర్ణాటక ప్రభుత్వ డబ్బుతో తెలంగాణలో భారీ ప్రకటనలు ఇస్తుండడం తీవ్ర చర్చనీయాంశమవుతోంది. Karnataka Congress Government advertisements in Telangana Edition Newspapers with statements of Beneficiaries are actually Models taken from Photo Agencies …. Sunil Kanugolu has turned Congress into BJP in Fakery 😁 pic.twitter.com/CAe9KVWmFY — Krishank (@Krishank_BRS) November 24, 2023 క్రిషాంక్ ట్వీట్ వైరల్: తెలంగాణలో కాంగ్రెస్ కొత్త ఎత్తుగడ ఇదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. జాతీయ, ప్రాంతీయ పత్రికల్లో ప్రకటనలు ఇచ్చింది. అయితే తెలంగాణ ఓటర్లను కాంగ్రెస్ మభ్యపెడుతోందని బీఆర్ఎస్ విమర్శలు గుప్పిస్తోంది. కర్ణాటకలో పథకాలపై తెలంగాణలో ప్రచారమేంటని అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. ఫేక్ ఫొటోలతో తప్పుడు ప్రచారం చేస్తోందని ఆరోపిస్తోంది. కాంగ్రెస్ చూపించే లబ్ధిదారులంతా ఫేక్ అని TSMDC చైర్మన్ క్రిషాంక్ ట్వీట్ చేశాడు. 'practicewitheve' సైట్‌లోని ఓ స్టూడెంట్‌ని మహేశ్ అనే పేరుతో కాంగ్రెస్ ప్రకటనలో లబ్ధిదారుడిగా పెట్టినట్లు ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఈ ట్వీట్ బీఆర్‌ఎస్ సర్కిల్స్‌లో తెగ చక్కర్లు కొడుతోంది. Also Read: మరీ ఇంత గర్వం పనికిరాదు కంగారూలూ.. WATCH: : #brs #congress #telangana-election-2023 #karnataka-congress మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి