Telangana: మిర్యాలగూడలో ఐటీ దాడులు.. భాస్కరరావు టార్గెట్‌గా సోదాలు.. బీఆర్ఎస్ అభ్యర్థి, సిట్టింగ్ ఎమ్మెల్యే భాస్కరరావు టార్గెట్‌గా మిర్యాలగూడలో ఐటీ అధికారులు రైడ్స్ నిర్వహిస్తున్నారు. ఏక కాలంలో 40 చోట్ల సోదాలు నిర్వహిస్తున్నారు. భాస్కరావు బంధువులు, సన్నిహితుల ఇళ్లలో తనిఖీలు చేపట్టారు అధికారులు. By Shiva.K 16 Nov 2023 in Latest News In Telugu తెలంగాణ New Update షేర్ చేయండి IT Raids in Miryalaguda: తెలంగాణ ఎన్నికల నేపథ్యంలో పొలిటికల్ లీడర్సే టార్గెట్‌గా ఐటీ రైడ్స్(IT Raids) కొనసాగుతున్నాయి. నిన్నటి వరకు హైదరాబాద్‌లోని(Hyderabad) పలువురు రాజకీయ నాయకుల అనుచరుల ఇళ్లలో సోదాలు నిర్వహించిన ఐటీ అధికారులు.. ఇప్పుడు నల్లగొండ జిల్లా వైపు మళ్లారు. జిల్లాలోని మిర్యాలగూడలో ఐటీ అధికారులు ఆకస్మిక దాడులు నిర్వహించారు. బీఆర్ఎస్ అభ్యర్థి భాస్కరరావు టార్గెట్‌గా సోదాలు నిర్వహిస్తున్నారు ఐటీ అధికారులు. భాస్కర్ రావు బంధువులు, అనుచరుల ఇళ్లలో తనిఖీలు నిర్వహించారు. ఏకకాలంలో 40 చోట్ల ఐటీ సోదాలు నిర్వహించారు అధికారులు. మిర్యాలగూడ, హైదరాబాద్‌లో తనిఖీలు నిర్వహిస్తున్నారు ఐటీ అధికారులు. మిర్యాలగూడ ఎమ్మెల్యే భాస్కర్ రావుకి పలు పవర్ ప్లాంట్స్ ఉన్నాయి. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో భాస్కరరావుకు పలు మార్గాల ద్వారా నిధులు సమకూరినట్లు ఐటీ అధికారులు పక్కా సమాచారం అందుకున్నారు. ఈ నేపథ్యంలోనే.. ఐటీ అధికారులు ఆకస్మిక సోదాలు చేపట్టారు. కాంట్రాక్టర్ వింజం శ్రీధర్ నివాసాల్లో ఇవాళ ఉదయం నుంచి సోదాలు నిర్వహిస్తున్నారు. ఉదయం 4 గంటకలే వైదేహి టౌన్‌షిప్‌కు వచ్చారు అధికారులు. వింజం శ్రీధర్.. ఎమ్మెల్యే భాస్కర్ రావుకు ప్రధాన అనుచరుడు. ఈ నేపథ్యంలోనే ఆయన ఇళ్లలో సోదాలు నిర్వహిస్తున్నారు. Also Read: ఆరోగ్యంగా ఉండాలంటే రోజుకు ఎన్ని గుడ్లు తినాలో తెలుసా? వివరాలు మీకోసం.. ఎమ్మెల్సీ కవిత మాస్ డ్యాన్స్.. తగ్గేదేలే అంటున్న గులాబీ శ్రేణులు..! #telangana-news #telangana-elections #telangana-politics #nallamothu-bhaskar-rao #it-raids-in-miryalaguda మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి