Telangana Elections: కాంగ్రెస్‌కు షాక్.. బీఆర్ఎస్‌లో చేరనున్న కీలక నేత..

నర్సాపూర్ కాంగ్రెస్ నేత గాలి అనిల్ కుమార్ బీఆర్ఎస్ పార్టీలో చేరనున్నారు. గురువారం నర్సాపూర్‌లో జరుగనున్న బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్ సమక్షంలో ఆయన గులాబీ కండువా కప్పుకోనున్నారు. కాంగ్రెస్‌కి రాజీనామా చేసిన అనిల్‌ను బీఆర్ఎస్‌లోకి ఆహ్వానించారు మంత్రి హరీష్ రావు.

New Update
Telangana Elections: కాంగ్రెస్‌కు షాక్.. బీఆర్ఎస్‌లో చేరనున్న కీలక నేత..

Gali Anil Kumar: నర్సాపూర్ కాంగ్రెస్ నేత గాలి అనిల్ కుమార్.. ఆ పార్టీ షాక్ ఇచ్చారు. ఆయన బీఆర్ఎస్ పార్టీలో(BRS) చేరబోతున్నారు. నర్సాపూర్ టికెట్ రాకపోవడంతో కాంగ్రెస్ పార్టీకి(Congress) రాజీనామా చేశారు గాలి అనిల్ కుమార్. దీంతో మంత్రి హరీష్ రావు ఇవాళ ఉదయం ఆయన ఇంటికి వెళ్లి బీఆర్ఎస్‌లో చేరాల్సిందిగా కోరారు. హరీష్ రావు ఆహ్వానం మేరకు తాను బీఆర్ఎస్ పార్టీలో చేరనున్నట్లు ప్రకటించారు గాలి. అంతేకాదు.. అనిల్‌కు నామినేషన్ పోస్టు ఇస్తామని మంత్రి హరీష్ రావు హామీ ఇచ్చారట. ఆ మేరకు ఆయన.. బీఆర్ఎస్‌ కండువా కప్పుకునేందుకు సిద్ధమయ్యారు గాలి అనిల్ కుమార్. గురువారం నాడు నర్సాపూర్‌లో సీఎం కేసీఆర్ ప్రజా ఆశీర్వాద సభ జరుగనుంది. ఈ సభలో కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్‌లో చేరనున్నారు గాలి అనిల్ కుమార్.

Also Read:

మిర్యాలగూడలో ఐటీ దాడులు.. భాస్కరరావు టార్గెట్‌గా సోదాలు..

ఎమ్మెల్సీ కవిత మాస్ డ్యాన్స్.. తగ్గేదేలే అంటున్న గులాబీ శ్రేణులు..!

Advertisment
Advertisment
తాజా కథనాలు