BREAKING: మంత్రి కేటీఆర్ కు ఈసీ నోటీసులు

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు నోటీసులు జారీ చేసింది ఎన్నికల కమిషన్. టీ-హబ్‌లో నిరుద్యోగులతో కేటీఆర్ సమావేశంపై ఈసీ సీరియస్ అయింది. రేపు సాయంత్రం 3 గంటలలోపు నోటీసులకు వివరణ ఇవ్వాలని ఈసీ ఆదేశాలు జారీ చేసింది.

New Update
BREAKING: హైదరాబాద్ లో భారీ అగ్నిప్రమాదం!

Telangana Elections 2023: ఎన్నికల వేళ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు ఎన్నికల కమిషన్ షాక్ ఇచ్చింది. కేటీఆర్‌కు నోటీసులు జారీ చేసింది. టీ-హబ్‌లో నిరుద్యోగులతో కేటీఆర్ సమావేశంపై ఈసీ సీరియస్ అయింది. కాంగ్రెస్‌ ఎంపీ రణదీప్‌ సుర్జేవాల ఫిర్యాదు ఆధారంగా నోటీసులు ఇచ్చింది. రాజకీయ కార్యకలాపాలకు ప్రభుత్వ ఆఫీసును వాడుకున్నారని ఫిర్యాదు రావడంతో.. ఫిర్యాదును పరిశీలించిన ఈసీ... మంత్రి కేటీఆర్‌ ప్రాథమిక ఎన్నికల నియామవాళిని ఉల్లంఘించినట్టు అభిప్రాయపడింది. ఈ నేపథ్యంలో రేపు సాయంత్రం 3 గంటలలోపు నోటీసులకు వివరణ ఇవ్వాలని ఈసీ ఆదేశాలు జారీ చేసింది.

ALSO READ: పవన్ కళ్యాణ్ కంటే బర్రెలక్క బెటర్.. RGV ట్వీట్ వైరల్!

అయితే, ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇటీవల మంత్రి కేటీఆర్ నిరుద్యోగ యువతతో టీ-హబ్‌లో భేటీ అయ్యారు. వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి ‘టీ’ వర్క్స్‌లో హామీ ఇచ్చారు కేటీఆర్‌. టీఎస్‌పీఎస్‌సీని ప్రక్షాళన చేస్తామని ‘టీ’ వర్క్స్‌లో స్పష్టత ఇచ్చారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు