Telangana Elections 2023: తెలంగాణ ఎన్నికల ప్రచారంలో బీసీ సీఎంపై బీజేపీ నేత, ఎమ్మెల్యే ఈటల రాజేందర్ (Eatala Rajendar) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నన్ను బీసీ ముఖ్యమంత్రి (BC CM) అంటున్నారని తెలిపారు. ఒక్క గజ్వేల్ ,ఓ గెలిస్తే సీఎం అవుతానా? లేదా హుజురాబాద్ లో నేను గెలిస్తే సీఎం అవుతానా? అని ప్రశ్నించారు. తెలంగాణలో బీసీ అభ్యర్థి సీఎం కావాలంటే ఈ ఎన్నికల్లో బీజేపీ (BJP) 70 స్థానాలకు పైగా గెలవాలని అన్నారు.
ALSO READ: జగన్ బెయిల్ రద్దు చేయాలని పిటిషన్.. ఎల్లుండే సుప్రీంలో విచారణ!
తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తే బీసీ అభ్యర్థిని ముఖ్యమంత్రి చేస్తామని బీజేపీ అధిష్ఠానం చెప్పిన విషయం తెలిసిందే. తెలంగాణలో 71 శాతం మంది ఉన్న బీసీల ఓటర్లను (BC Voters) తమవైపు తిప్పుకునేందుకు బీజేపీ అధిష్ఠానం బీసీ అభ్యర్థిని సీఎం చేస్తామని ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఎవరు ఆ బీసీ సీఎం అనే చర్చ తెలంగాణ రాజకీయాల్లో (Telangana Politics) మొదలైంది.
ALSO READ: పాల ప్యాకెట్లపై GST… హరీష్ రావు కీలక వ్యాఖ్యలు!
ఇదిలా ఉండగా తెలంగాణలో కాషాయ జెండా ఎగురవేసేందుకు బీజేపీ అధిష్ఠానం అగ్రనేతలను ప్రచారంలో దింపింది. ఇప్పటికే ప్రధాని మోదీ (PM Modi), అమిత్ షా (Amit Shah), నిర్మలాసీతారామన్ (Nirmala Sitharaman) తదితర కేంద్ర మంత్రులు తెలంగాణలో పర్యటన చేస్తున్నారు. NDAలో భాగస్వామ్యం అయిన జనసేనతో (Janasena) తెలంగాణ ఎన్నికల్లో పొత్తు పెట్టుకుంది బీజేపీ. ఈ నేపథ్యంలో బీజేపీ తరఫున తెలంగాణలో ప్రచారం చేస్తున్నారు పవన్ కళ్యాణ్ (Pawan Kalyan). పొత్తులో భాగంగా జనసేనకు 10 స్థానాల్లో పోటీ చేస్తోంది.