Telangana Elections 2023: రైతుల నోట్లో మన్నుకొడుతూ రైతుబంధుని నిలిపివేసే దుర్మార్గమైన కుట్ర చేసింది రేవంత్ రెడ్డి (Revanth Reddy) కాంగ్రెస్ (Congress) అని అన్నారు బీఆర్ఎస్ సీనియర్ నేత దాసోజు శ్రవణ్ (Dasoju Sravan). రేటంత రెడ్డిగా వున్న రేవంత్.. ఈ రోజు రైతుల పాలిట రాబందు రెడ్డిగా మారిండు అని మండిపడ్డారు.
ALSO READ: మందు బాబులకు ALERT.. రేపటి నుండి వైన్స్ బంద్!
దేశంలో ఎక్కడా లేని విధంగా రైతుబంధు, రైతురుణమాఫీ పధకాలకు దాదాపు లక్ష కోట్ల రూపాయిలు కేసీఆర్ ఖర్చు చేశారని అన్నారు. గిట్టుబాటు ధరలు, పుష్కలంగా సాగునీరు, 24 గంటల ఉచిత కరెంట్, రైతు వేదికలు ఇలా అద్భుతమై రీతిలో రైతులకు కేసీఆర్ అండగా వుంటే... ఇది చూసి ఓర్వలేని రేవంత్ కాంగ్రెస్, బిజేపీతో కుమ్మకై ఎన్నికల కమీషన్ పై ఒత్తిడి తెచ్చి దుర్మార్గంగా వ్యవహరించిందని ఫైర్ అయ్యారు.
చిల్లర రాజకీయాల కోసం కాంగ్రెస్ పార్టీ లక్షలాది రైతుల జీవితాలతో చెలగాటమాడడం అన్యాయమని అన్నారు. లేఖ రాసిన రేవంత్ రెడ్డి సిగ్గు శరం లేకుండా ఇది తన లేఖ కాదని దాటవేత ధోరణిని ప్రదర్శిస్తుండు అని ఆరోపించారు.
మూడో తారీకు తర్వాత కేసీఆర్ గారు మూడో సారి ముఖ్యమంత్రి అయిన తర్వాత రైతుబంధు పూర్తి స్థాయిలో అమల్లోకి వస్తుందని స్పష్టం చేశారు. ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని.. కుట్ర రాజకీయాలు చేస్తున్న కాంగ్రెస్ కు తెలంగాణ ప్రజలు కర్రుకాల్చి వాత పెట్టడం ఖాయమని అన్నారు.
ALSO READ: పెన్షన్ రూ.5000.. కేసీఆర్ సంచలన ప్రకటన!