TS elections 2023: కొత్తగూడెంలో.. కూనంనేని గట్టెక్కుతారా?

ఈ ఎన్నికల్లో సీపీఐ కేవలం ఒక్క స్థానంలోనే పోటీ చేస్తోంది. కొత్తగూడెం నుంచి సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు పోటీ చేస్తున్నారు. ప్రభుత్వ వ్యతిరేకత తనకు కలిసి వస్తుందని.. తాను గెలుస్తానంటున్నారు కూనంనేని.

New Update
TS elections 2023: కొత్తగూడెంలో.. కూనంనేని గట్టెక్కుతారా?

ఉమ్మడి ఏపీలో ఓ వెలుగు వెలిగిన కమ్యూనిస్టు పార్టీలు..ఈ ఎన్నికల్లో పరిమిత స్థానాల్లో బరిలోకి దిగుతున్నాయి. కాంగ్రెస్‌ పొత్తులో భాగంగా సీపీఐ ఒక్క కొత్తగూడెం నుంచి మాత్రమే పోటీలో ఉంది. మరి ఈ ఒక్క సీటైనా CPI గెలుస్తుందా? BRS, BJPలను తట్టుకొని కూనంనేని గెలవగలరా? కొత్తగూడెంలో ప్రస్తుత పరిస్థితి ఏంటి? ఎవరికి విజయావకాశాలు ఉన్నాయి?

వ్యతిరేకత కలిసి వస్తుందా?
కొత్తగూడెం నుంచి సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు పోటీ చేస్తున్నారు. అక్కడ ప్రచారాన్ని ఉధృతం చేశారు. 2009 ఎన్నికల్లో కొత్తగూడెం నుంచి ఆయన గెలుపొందారు. సమీప కాంగ్రెస్ ప్రత్యర్థి వనమాపై 2 వేల 4 ఓట్లతో గెలిచారు. మొత్తం ఆయనకు 47 వేల 28 ఓట్లు రాగా..వనమాకు 45 వేల 24 ఓట్లు వచ్చాయి. తాజాగా మరోసారి ఇద్దరి మధ్య పోటీ నెలకొంది. బీఆర్ఎస్‌ నుంచి వనమా పోటీ చేస్తుంటే..కాంగ్రెస్, సీపీఐ ఉమ్మడి అభ్యర్థిగా కూనంనేని బరిలో ఉన్నారు. ఈసారి ఇద్దరి మధ్య పోటీ తప్పదని సర్వేలు చెబుతున్నాయి. వనమాపై ఉన్న వ్యతిరేకత కలిసి వస్తుందని సీపీఐ భావిస్తోంది.

Also Read: రోహిత్‌ శర్మ దెబ్బకు కోహ్లీ ఫ్రెండ్‌ రికార్డు గల్లంతు.. సూపర్‌ ‘హిట్‌’మ్యాన్‌..!

జర్నలిస్ట్‌గా ప్రస్థానం:
1956లో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చుంచుపల్లిలో కూనంనేని సాంబశివరావు జన్మించారు. విశాలాంధ్ర పేపర్‌లో డెస్క్ జర్నలిస్టుగా వృత్తి జీవితాన్ని ప్రారంభించారు. ఆ తర్వాత విశాలాంధ్ర రిపోర్టర్‌గా పనిచేశారు. జర్నలిస్టుగా పనిచేస్తూ రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. 1984లో సీపీఐ కొత్తగూడెం పట్టణ కార్యదర్శిగా సేవలందించారు. 1987లో కొత్తగూడెం మండల పరిషత్ ఛైర్మన్‌గా ఎన్నికయ్యారు.
2004 ఎన్నికల్లో సీపీఐ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు.

ఒక్క స్థానంలోనే పోటి:
2009లో మహా కూటమి తరపున కొత్తగూడెం నియోజకవర్గం నుంచి తొలిసారి ఎమ్మెల్యేగా గెలుపొందారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2014, 2018 ఎన్నికల్లో వరుసగా ఓడిపోయారు. 2022 సెప్టెంబర్ 8న సీపీఐ రాష్ట్ర కార్యదర్శిగా ఎన్నికయ్యారు. ఏదిఏమైనా ఈఎన్నికల్లో ఆ పార్టీ కేవలం ఒక్క స్థానంలోనే పోటీ చేస్తోంది. పొత్తులో భాగంగా నాలుగు స్థానాలు కావాలని చివరి వరకు సీపీఐ పట్టుబట్టింది. ఐతే కాంగ్రెస్‌ మాత్రం పట్టించుకోలేదు. చివరి నిమిషంలో కొత్తగూడెం సీటునే కేటాయించింది. ప్రభుత్వ వ్యతిరేకత తనకు కలిసి వస్తుందంటున్నారు కూనంనేని సాంబశివరావు. ప్రచారంలోనూ ఇదే అస్త్రాన్ని సంధిస్తున్నారు. మరి కొత్తగూడెం కింగ్ ఎవరో చూడాలి.

Also Read: 50వ సెంచరీకి ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే.. కోహ్లీ.. ప్చ్..!

WATCH: 

Advertisment
తాజా కథనాలు