/rtv/media/post_attachments/wp-content/uploads/2023/10/Ponguleti-Thummala-jpg.webp)
TS Congress Candidates List: తెలంగాణ కాంగ్రెస్ (Telangana Congress) అభ్యర్థుల తుది జాబితా ఈ నెల 15న విడుదల చేస్తామని స్క్రీనింగ్ కమిటీ చైర్మన్ మురళీధరన్ ప్రకటించిన విషయం తెలిసిందే. తమకు కంచుకోటగా భావిస్తున్న ఖమ్మం జిల్లాలోని జనరల్ నియోజకవర్గాలకు కాంగ్రెస్ టికెట్లు కన్ఫామ్ అయినట్లు సమాచారం. కొత్తగూడెం టికెట్ ను పొత్తుల్లో భాగంగా సీపీఐకి ఇవ్వాలని కాంగ్రెస్ నాయకత్వం డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. ఆ స్థానం నుంచి కూనంనేని సాంబశివరావు పోటీ చేయనున్నట్లు సమాచారం. 2019లోనూ ఆయన కొత్తగూడెం నుంచి గెలుపొందారు. ఖమ్మం నుంచి తుమ్మల నాగేశ్వర రావు (Tummala Nageswara Rao), పాలేరు నుంచి పొంగులేటి శ్రీనివాసరెడ్డిని (Ponguleti Srinivas Reddy) పోటీకి దించాలని హైకమాండ్ నిర్ణయించినట్లు సమాచారం.
ఇది కూడా చదవండి: ఒకటే లిస్ట్.. 119 మంది కాంగ్రెస్ అభ్యర్థులు ఫైనల్
అయితే.. టీడీపీలో ఉన్న నాటి నుంచి తుమ్మల నాగేశ్వర రావు పాలేరు నుంచి పోటీ చేయడానికే ఆసక్తి చూపేవారు. సిట్టింగ్ ఎమ్మెల్యే రాంరెడ్డి వెంకట్ రెడ్డి మరణం తర్వాత జరిగిన ఉప ఎన్నికల్లో ఆయన అక్కడి నుంచి పోటీ చేసి గెలుపొందారు. తర్వాత 2018లో జరిగిన సాధారణ ఎన్నికల్లో ఆయన పాలేరు నుంచి మరో సారి పోటీ చేసి ఓటమి పాలయ్యారు.
వాస్తవానికి.. పొంగులేటి, తుమ్మల ఇద్దరూ పాలేరు టికెట్ కోసమే పోటీపడ్డారు. ఈ నేపథ్యంలో తుమ్మల ఖమ్మం నుంచి పోటీ చేయడానికి అయిష్టంగానే అంగీకరించారన్న ప్రచారం సాగుతోంది. ఈ మూడు టికెట్లతో పాటు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మొత్తం 7 స్థానాలకు కాంగ్రెస్ అభ్యర్థుల పేర్లు ఖరారైనట్లు సమాచారం. ప్రస్తుతం సీఎల్పీ నేతగా ఉన్న భట్టి విక్రమార్క మరో సారి తన సిట్టింగ్ స్థానమైన మధిర నుంచే పోటీకి దిగనున్నారు.