CM KCR: ఒకే విడతలో రూ.10లక్షలు.. సీఎం కేసీఆర్ సంచలన హామీ

ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈరోజు మానకొండూర్ నియోజకవర్గంలో పర్యటించారు సీఎం కేసీఆర్. ప్యాసింజర్ ఆటో డ్రైవర్లకు సీఎం కేసీఆర్ తీపికబురు అందించారు. ఫిట్‌నెస్, పర్మిట్ ఫీజులు మాఫీ చేస్తామని హామీ ఇచ్చారు. అలాగే, దళిత బంధు కూడా ఒకే దఫాలో ఇస్తామని అన్నారు.

CM KCR: ఒకే విడతలో రూ.10లక్షలు.. సీఎం కేసీఆర్ సంచలన హామీ
New Update

Telangana Elections 2023: ఎన్నికల ప్రచారంలో తనదైన శైలిలో దూసుకుపోతున్నారు గులాబీ బాస్ కేసీఆర్. ఈరోజు కరీంనగర జిల్లా మానకొండూర్ నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ ప్రజాశీర్వాద సభలో సీఎం కేసీఆర్ పాల్గొన్నారు. మానకొండూర్ బీఆర్ఎస్ అభ్యర్థి రసమయి బాలకిషన్ ను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఇక్కడ బీఆర్ఎస్ ఎమ్మెల్యే గెలిస్తే అక్కడ సీఎం నేనే అవుత అని అన్నారు.

ALSO READ: చంద్రబాబుకు బిగ్ రిలీఫ్.. రెగ్యులర్ బెయిల్ మంజూరు

మానకొండూర్ సభలో సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. ప్యాసింజర్ ఆటో డ్రైవర్లకు సీఎం కేసీఆర్ తీపికబురు అందించారు. ఫిట్‌నెస్, పర్మిట్ ఫీజులు మాఫీ చేస్తామని హామీ ఇచ్చారు. సుమారు రూ.100 కోట్లు మాఫీ చేయనున్నట్లు తెలిపారు. దీనిద్వారా లక్షలాది మంది ఆటోడ్రైవర్లకు లబ్ది చేకూరుతుందని సీఎం కేసీఆర్ వెల్లడించారు.

బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ కోసమే పుట్టిందిని కేసీఆర్‌ ఉద్ఘాటించారు. 50 ఏళ్లు పాలించిన కాంగ్రెస్‌ ఏం చేసిందో ఆలోచించాలని ప్రజలను కోరారు. ఇందిరమ్మ రాజ్యంలో ఆకలిచావులు తప్ప ఇంకేమీ లేవని అన్నారు. ఎన్టీఆర్‌ అధికారంలోకి వచ్చి రూ.2కే కిలో బియ్యం ఇచ్చారని గుర్తు చేశారు .కాంగ్రెస్‌ పాలన బాగుంటే ఎన్టీఆర్ పెట్టిన టీడీపీ పార్టీ ఎందుకు పుట్టి ఉండేది అని ప్రశ్నించారు.

ALSO READ: పోలీసుల అదుపులో లోకల్‌ బాయ్ నాని

కాంగ్రెస్ బలవంతంగా తీసుకెళ్లి తెలంగాణను ఆంధ్రలో కలిపి ఇబ్బంది పెట్టిందని మండిపడ్డారు. కాంగ్రెస్‌ తెలంగాణ ఇవ్వకుండా.. బిఆర్ఎస్ పార్టీని చీల్చే ప్రయత్నం చేసిందని ఆరోపించారు. దేశంలో హోంగార్డులకు అత్యధిక జీతాలు ఇస్తున్న రాష్ట్రం తెలంగాణ అని హర్షం వ్యక్తం చేశారు.

తెలంగాణలో వడ్లు పండించినట్లు .. వచ్చే ఐదేళ్లు యుద్ధ ప్రాతిపదికన ఇండ్లు కడ్తాం అన్నారు. హుజురాబాద్ లాగా మానకొండూరులోనూ పైలట్ ప్రాజెక్టులాగా దళితబంధు ఒకే దఫాలో ఇస్తామని పేర్కొన్నారు.

#cm-kcr #telangana-elections-2023 #telugu-latest-news #dalitha-bandhu
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe