Barrelakka: బర్రెలక్క గెలుస్తుందా? బర్రెలక్క వల్ల ఏపార్టీకి నష్టం, ఏపార్టీకి లాభం?

కొల్లాపూర్‌ నుంచి పోటి చేస్తున్న ఇండిపెండెంట్‌ అభ్యర్థి బర్రెలక్క తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్‌గా మారింది. బర్రెలక్క 5వేల నుంచి పదివేల ఓట్లు సాధించినా ఎమ్మెల్యే క్యాండిడేట్‌ను డిసైడ్‌ చేసేది ఆమె అవుతుంది. కాంగ్రెస్ ఓటు బ్యాంకుకు బర్రెలక్క గండికొట్టే అవకాశాలు ఉన్నాయనే చర్చ జరుగుతోంది.

Barrelakka: బర్రెలక్క గెలుస్తుందా? బర్రెలక్క వల్ల ఏపార్టీకి నష్టం, ఏపార్టీకి లాభం?
New Update

బర్రెలక్క(Barrelakka) గెలుస్తుందా?. ఓడిపోతుందా?. బర్రెలక్కకు ఎన్ని ఓట్లు వస్తాయి?. బర్రెలక్క వల్ల ఏపార్టీకి నష్టం, ఏపార్టీకి లాభం? అసలు బర్రెలక్క వెనుకుంది ఎవరు?. ఇలా అనేక ప్రశ్నలు మీ మెదడ్లను తొలుస్తున్నాయనే విషయం నాకు తెలుసు. మీ ప్రశ్నలన్నింటికి ఇపుడు ఇక్కడ సమాధానం చెప్పబోతున్నాము.

నెక్‌ టూ నెక్‌ ఫైట్:
తెలుగు రాష్ట్రాల్లో ఇపుడు అందరిచూపు కొల్లాపూర్‌ పైనే. నిరుద్యోగ యువతి బర్రెలక్క ఇక్కడి నుంచి పోటీ చేయడమే ఇందుకు కారణం. ఎక్కడ చూసినా ఇపుడు బర్రెలక్కే హాట్ టాపిక్. గత ఎన్నికల్లో కొల్లాపూర్‌ ఫలితాలను పరిశీలిస్తే అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న BRSఅభ్యర్థి జూపల్లి కృష్ణారావు.. కాంగ్రెస్ అభ్యర్థి బీరం హర్షవర్ధన్‌రెడ్డి చేతిలో ఓడిపోయారు. హర్షవర్ధన్‌రెడ్డికి 80వేల 611 ఓట్లు వచ్చాయి. జూపల్లికి 68వేల 68ఓట్లు పోలయ్యాయి. ఇక్కడ అభ్యర్థి గెలుపును డిసైడ్ చేసింది కేవలం 12వేల 543 మాత్రమే. మనం జాగ్రత్తగా పరిశీలిస్తే బీజేపీ తరఫున పోటీచేసిన ఎల్లేని సుధాకర్‌రావుకు 13వేల 154 ఓట్లు వచ్చాయి. అంటే ఇక్కడ ఎమ్మెల్యే క్యాండిడేట్‌ను డిసైడ్ చేసింది బీజేపీ అభ్యర్థి సుధాకర్‌రావు. అలాగే లాస్ట్‌ ఎలక్షన్స్‌లో ఓ పది మంది ఇండిపెండెంట్లు కూడా బరిలోకి దిగారు. వాళ్లందరినీ పక్కనపెడితే ఓ ఇండిపెండెంట్‌కు అత్యధికంగా 3వేల 413 ఓట్లు వచ్చాయి. అంటే రేపటి రోజున బర్రెలక్క 5వేల నుంచి పదివేల ఓట్లు సాధించినా ఎమ్మెల్యే క్యాండిడేట్‌ను డిసైడ్‌ చేసేది ఆమె అవుతుంది. ఎందుకంటే BRS,కాంగ్రెస్‌ మధ్య ఎలాగూ నెక్‌ టూ నెక్‌ ఫైట్ ఉంటుంది. బీజేపీ కూడా పెద్ద ఎత్తున ఓట్లు చీల్చుతుంది. ఇక బర్రెలక్క కూడా తోడయితే రిజల్ట్‌ తారుమారయ్యే అవకాశాలు లేకపోలేదు.

బీఆర్‌ఎస్‌కే ప్లసా?
ఇక బర్రెలక్కకు పడే మెజారిటీ ఓట్లు నిరుద్యోగులవే అనే చర్చ అయితే జరుగుతోంది. ఇలా ప్రభుత్వ వ్యతిరేక ఓటు... అటు కాంగ్రెస్‌, ఇటు బర్రెలక్క ఇద్దరూ షేర్ చేసుకుంటారు. అంటే కాంగ్రెస్ ఓటు బ్యాంకుకు ఇక్కడ బర్రెలక్క గండికొట్టే అవకాశాలు ఉన్నాయనే చర్చయితే జరుగుతోంది. సో బర్రెలక్క ఎన్ని ఎక్కువ ఓట్లు సాధిస్తే అధికారపార్టీకి అది అంత ప్లస్ అనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.

Also Read: బుద్ధి బయటపెట్టుకున్నారుగా.. బంగ్లా ఫ్యాన్స్‌ తో జాగ్రత్తగా ఉండాలి భయ్యో!

#telangana-elections-2023 #kollapur #barrelakka #jupali-krishna-rao
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe