Bandi Sanjay: 'యూజ్ లెస్ ఫెలో'.. కేటీఆర్ పై ధ్వజమెత్తిన బండి! ఎన్నికల ప్రచారంలో మంత్రి కేటీఆర్ పై ధ్వజమెత్తారు బండి సంజయ్. 'యూజ్ లెస్ ఫెలో' అంటూ ఫైర్ అయ్యారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలకు అధికారం ఇస్తే ప్రభుత్వం కూలిపోతుందని అన్నారు. తెలంగాణలో వచ్చేది బీజేపీ ప్రభుత్వమే అని ధీమా వ్యక్తం చేశారు. By V.J Reddy 22 Nov 2023 in Latest News In Telugu తెలంగాణ New Update షేర్ చేయండి Telangana Elections 2023: మంత్రి కేటీఆర్ పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు బీజేపీ నేత, ఎంపీ బండి సంజయ్. ‘యూజ్ లెస్ ఫెలో… ఉద్యోగాలు ఎందుకివ్వడం లేదని నిరుద్యోగులు నిరసన తెలిపితే సముదాయించాాల్సింది పోయి తిడతావా? దవడ పళ్లు రాలకొడితే సరి… కండకావరమెక్కి మాట్లాడుతున్నవు' అని ఫైర్ అయ్యారు. ALSO READ: పాల ప్యాకెట్లపై GST… హరీష్ రావు కీలక వ్యాఖ్యలు! ఎన్నికల ప్రచారంలో భాగంగా చొప్పదండి నియోజకవర్గం గంగాధరలో పర్యటించిన బండి సంజయ్ (Bandi Sanjay) మాట్లాడుతూ.. సీఎంగా కేసీఆర్ (KCR) ముఖమే చూడలేకపోతున్నామని సెటైర్లు వేశారు. ఇగ కండకావరమెక్కిన కేటీఆర్ (KTR) ను ఎవడు చూడాలే… ఒక్కసారి గతంలోకి వెళ్లు.. ముడతల చొక్కా, అరిగిన రబ్బర్ చెప్పుల సంగతి గుర్తు లేదా? అని కేటీఆర్ ను ప్రశ్నించారు. కాంగ్రెస్ (Congress), బీఆర్ఎస్ (BRS) పార్టీలో ఏ పార్టీ అధికారంలో వచ్చినా మధ్యంతర ఎన్నికల తథ్యం అని జోస్యం చెప్పారు. బీఆర్ఎస్ గెలిస్తే కేసీఆర్ తన కొడుకును సీఎం చేస్తాడని అన్నారు. అప్పుడు కవిత, హరీష్ రావు, సంతోష్ రావు ఊరుకుంటారా? వాళ్లంతా తలో 10 మంది ఎమ్మెల్యేలను తీసుకుని వెళ్లిపోతే ప్రభుత్వం ఉంటదా? అని అన్నారు. ALSO READ: అట్లయితే.. నేను సీఎం ఎట్లయితా?.. ఈటల సంచలన వ్యాఖ్యలు! కాంగ్రెస్ లో అందరూ సీఎంలే అని అన్నారు. ఒకరిని సీఎం చేస్తే మిగిలిన వాళ్లంతా ఎమ్మెల్యేలను వెంట బెట్టుకుని పార్టీని వీడతారని తెలిపారు. ఈ రెండు పార్టీల్లో ఏది అధికారంలోకి వచ్చినా ప్రభుత్వం అర్ధంతరంగా కూలిపోవడం ఖాయం… మళ్లీ ఎన్నికలు రావడం ఖాయమని అన్నారు. కేసీఆర్ పాలనలో సీఎం సహా మంత్రులు, ఎమ్మెల్యేలంతా ఫాంహౌజ్ లు కట్టుకున్నారని విమర్శించారు. కేసీఆర్ కూడా 100 రూముల ప్రగతి భవన్ కట్టుకున్నాడని.. మరి నిలువనీడలేని పేదలకు మాత్రం గూడు ఎందుకు కల్పించలేదు? వాళ్లు చేసిన పాపమేంది? అని ప్రశ్నించారు. ALSO READ: జగన్ బెయిల్ రద్దు చేయాలని పిటిషన్.. ఎల్లుండే సుప్రీంలో విచారణ! కాంగ్రెస్ 6 గ్యారంటీలను మడిచి పెట్టుకోండి… కానీ గెలిచాక అమ్ముడుపోబోమనే గ్యారంటీ ఇవ్వగలరా? అని కాంగ్రెస్ నేతలను విమర్శించారు. పాతబస్తీలో కరెంట్ బిల్లులు వసూలు చేయలేని దద్దమ్మ కేసీఆర్ అని విమర్శించారు. 12 శాతం ఓట్ల కోసం కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు ఎంఐఎంకు కొమ్ముకాస్తున్నాయని ఆరోపించారు. మరి 80 శాతమున్న హిందువులంతా ఏకం కావాల్సిన అవసరం ఉందని పిలుపునిచ్చారు. #ktr #kcr #bandi-sanjay #telangana-elections-2023 #telugu-latest-news #telangana-election-news మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి