TS Polls: కేసీఆర్ సర్కార్ అవినీతిపై విచారణ.. నిర్మల సంచలన వ్యాఖ్యలు!

కేసీఆర్ సర్కార్ పై నిప్పులు చెరిగారు కేంద్ర మంత్రి నిర్మలాసీతారామన్. బంగారు తెలంగాణను అప్పుల తెలంగాణగా కేసీఆర్ మార్చాడన్నారు. కేసీఆర్ సర్కార్ అవినీతిపై విచారణ జరిపిస్తామని తేల్చి చెప్పారు. JAN 22న అయోధ్య దర్శనానికి తెలంగాణ వృద్దులను ఉచితంగా తీసుకెళ్తామన్నారు.

New Update
TS Polls: కేసీఆర్ సర్కార్ అవినీతిపై విచారణ.. నిర్మల సంచలన వ్యాఖ్యలు!

Telangana Elections 2023: బీఆర్ఎస్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలాసీతారామన్ (FM Nirmala Seetharaman). తెలంగాణ అవశ్యకతకు సంబంధించిన నీళ్లు, నిధులు, నియామకాలు ఇప్పటి వరకు అమలు కాలేదని అన్నారు. 2014 రాష్ట్ర విభజన తరువాత తెలంగాణ ధనిక రాష్ట్రంగా ఉందని పేర్కొన్నారు. పెట్టుబడులకు అనుకూలంగా రాజధానిగా ఉన్న రాష్ట్రం లోటు బడ్జెట్ లో ఉందని అన్నారు.

రాబోయే తరాల మీద భారం మోపేలా తెలంగాణలో సీఎం కేసీఆర్ (CM KCR) పదేళ్ల పాలన ఉందని విమర్శించారు. ద్రవ్యోల్బణాన్ని(Inflation) కట్టడి చేసేందుకు కేంద్రం కృషి చేస్తున్నా.. రాష్ట్ర ప్రభుత్వం ఆ దిశగా ప్రయత్నాలు చేయడం లేదని పేర్కొన్నారు. బంగారు తెలంగాణను కేసీఆర్‌ అప్పులపాలు చేశారని అన్నారు. మిగులు బడ్జెట్‌తో ఉన్న తెలంగాణను రెవెన్యూ లోటుకు తీసుకొచ్చిన ఘనత కేసీఆర్‌కే దక్కుతుందని ఎద్దేవా చేశారు.

ALSO READ: బీజేపీకి షాక్.. కాంగ్రెస్ లో చేరిన కీలక నేత!

కాళేశ్వరం ప్రాజెక్టు (Kaleshwaram project) నాణ్యత అధ్వాన్నంగా ఉందని అన్నారు. ఫిల్లర్లు కుంగిపోవడం మామూలు విషయం కాదని పేర్కొన్నారు. కాళేశ్వం ప్రాజెక్టు నిర్మాణం చేయటంలో కేసీఆర్ సర్కార్ విఫలమైందని అన్నారు. కేసీఆర్ సర్కార్ అవినీతిపై విచారణ జరిస్తాం. బీసీ నేతను ముఖ్యమంత్రి చేసి తీరుతాం అని తేల్చి చెప్పారు. దళితుడిని ముఖ్యమంత్రిని చేస్తానని చెప్పి కేసీఆర్ మోసం చేశారని మండిపడ్డారు. తాటికొండ రాజయ్యను ఉప ముఖ్యమంత్రినీ చేసి ఆరు నెలల్లోనే ఆ పదవి నుంచి తొలగించారని విమర్శించారు. ఎస్సీలకు ఉన్నత పదవి ఇచ్చినట్లు కేసీఆర్ గొప్పలు చెప్పుకుంటున్నారని అన్నారు.

కేసీఆర్ పాలనలో విద్యకు ఇవ్వాల్సిన ప్రాధాన్యత ఇవ్వలేదని పేర్కొన్నారు. రాష్ట్రంలోని 11 యూనివర్శిటీల్లో 2 వేళ పోస్టులు (Jobs) ఖాళీగా ఉన్నాయని తెలిపారు. కేసీఆర్ కు ప్రజలు కాకుండా కేవలం కుటుంబం గురించే ఆలోచన అని అన్నారు. కేసీఆర్.. 3016 నిరుద్యోగ భృతి ఇస్తానని ఇవ్వలేదు.. ఉద్యోగాలు భర్తీ చేయలేదని ఫైర్ అయ్యారు.

ALSO READ: కాంగ్రెస్ అధికారంలోకి రాదు.. భట్టి సీఎం కాడు.. కేసీఆర్ జోస్యం!

తెలంగాణలో 6 వేల మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని నిర్మల తెలిపారు. రైతు సంక్షేమం కోసం తెలంగాణకు జాతీయ పసుపు బోర్డును మోదీ ఇచ్చారని పేర్కొన్నారు. ఓటు బ్యాంకు రాజకీయాల కోసం తీసుకువచ్చిన మతపరమైన రిజర్వేషన్లను తొలిగిస్తామని తెలిపారు. ఎస్సీ వర్గీకరణకు చట్టబద్దత కల్పిస్తామని హామీ ఇచ్చారు.అలాగే, జనవరి 22న అయోధ్య దర్శనానికి తెలంగాణ వృద్దులను ఉచితంగా తీసుకెళ్తాము అని అన్నారు.

Advertisment
తాజా కథనాలు