Telangana Elections : ఈసారి తెలంగాణ అసెంబ్లీలోకి 15 మంది డాక్టర్లు.. లిస్ట్ ఇదే!

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఈసారి ఏకంగా 15 మంది డాక్టర్లు విజయం సాధించారు. కొంతమంది ఎంబీబీఎస్ డాక్టర్లుండగా మరికొంతమంది స్పెషలిస్టులున్నారు. అంతేకాదు వీరిలో 10 మంది తొలిసారి అసెంబ్లీలో అడుగుపెట్టబోతుండటం విశేషం. కాగా మిగతా 5గురికి ప్రజాప్రతినిధులుగా పనిచేసిన అనుభవం ఉంది.

New Update
Telangana Elections : ఈసారి తెలంగాణ అసెంబ్లీలోకి 15 మంది డాక్టర్లు.. లిస్ట్ ఇదే!

తెలంగాణ ఎన్నికల్లో హస్తం జయకేతనం ఎగరవేసింది. మొదటినుంచే స్పష్టమైన మెజార్టీతో దూసుకుపోయిన కాంగ్రెస్ 64 స్థానాల్లో గెలిచి తెలంగాణలో ప్రభుత్వం ఏర్పాటు చేయనుంది. అయితే ఈసారి ఎన్నికల్లో ఆసక్తికరమైన పరిణామాలు చోటుచుకున్నాయి. చట్టసభల్లోకి చదువుకున్న నాయకులు రావాలని, అలాగైతేనే సమజానికి మేలు జరుగుతుందని ప్రజలు ఆకాంక్షిస్తున్నారు. కానీ దీనికి భిన్నంగా కొంతమంది నాయకులు కనీసం పది పాసయ్యారో లేదో కూడా తెలియకుండానే పరిపాలన కొనసాగిస్తున్న విషయం తెలిసిందే. కాగా ఈ యేడాది ఏకంగా 15 మంది డాక్టర్లు ఎమ్మెల్యేలుగా గెలిచి అసెంబ్లీలోకి అడుగుపెట్టబోతుండటం విశేషం.

ఈ మేరకు ఈ పదిహేను మందిలో కొంతమంది ఎంబీబీఎస్ డాక్టర్లుండగా మరికొంతమంది స్పెషలిస్టులున్నారు. అంతేకాదు వీరిలో 10 మంది తొలిసారి అసెంబ్లీలో అడుగుపెట్టబోతుండటం మరో విశేషంగా చెప్పుకోగా.. 5గురు ప్రజాప్రతినిధులుగా పనిచేసిన అనుభవం ఉంది. ఒకసారి ఈ పదిహేను మంది బయోడెటా పరిశీలిస్తే..

1. చెన్నూర్ నుంచి కాంగ్రెస్ తరఫున పోటీచేసిన మాజీ ఎంపీ, డాక్టర్ వివేక్ వెంకటస్వామి (ఎంబీబీఎస్). బీఆర్ఎస్ అభ్యర్థి బాల్కసుమన్ పై గెలిచారు.
2. అచ్చంపేటనుంచి పోటీచేసిన కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ (జనరల్ సర్జన్). బీఆర్ఎస్ అభ్యర్థి గువ్వల బాలరాజ్ ను ఓడించారు.
3. నిజమాబాద్ నుంచి బరిలోకి దిగిన మాజీ ఎమ్మెల్యే, డాక్టర్ భూపతిరెడ్డి (ఆర్థోపెడాలజిస్ట్). బాజిరెడ్డి గోవర్థన్ రెడ్డినిపై గెలిచారు.
4. డాక్టర్‌ రామచంద్రునాయక్‌ (ఎంఎస్‌ సర్జన్‌) డోర్నకల్‌.
5. డాక్టర్‌ పాల్వాయి హరీశ్‌బాబు (ఎంఎస్‌ ఆర్థో), సిర్పూర్‌.
6. డాక్టర్‌ మురళీనాయక్‌ (ఎంఎస్‌ సర్జన్‌), మహబూబాబాద్‌.
7. డాక్టర్‌ కవ్వంపల్లి సత్యనారాయణ (ఎంఎస్‌ సర్జన్‌), మానకొండూరు.
8. డాక్టర్‌ చిట్టెం పర్ణికారెడ్డి (ఎండీ రేడియాలజీ), నారాయణపేట.
9. డాక్టర్‌ పటోళ్ల సంజీవరెడ్డి (పీడియాట్రిషన్‌), నారాయణఖేడ్‌.
10. డాక్టర్‌ మైనంపల్లి రోహిత్‌ (ఎంబీబీఎస్‌), మెదక్‌.
11. డాక్టర్‌ సంజయ్‌కుమార్‌ (కంటి డాక్టర్‌), జగిత్యాల.
12. డాక్టర్‌ సంజయ్‌కుమార్‌ (న్యూరోస్పైన్‌ సర్జన్‌), కోరుట్ల.
13. డాక్టర్‌ తెల్లం వెంట్రావు (ఆర్థో), భద్రాచలం.
14. డాక్టర్‌ కూచుకుళ్ల రాజేశ్‌రెడ్డి (డెంటల్‌), నాగర్‌కర్నూల్‌.
15. డాక్టర్‌ మట్టా రాగమయి (పల్మనాలజిస్ట్‌), సత్తుపల్లి.. వీరంతా విజయం సాధించారు.

Also read :Bandi Sanjay: బీఆర్‌ఎస్‌ ఓటమి సంతోషాన్నిచ్చింది: బండి సంజయ్‌

ఇక వైద్యులుగా సేవలందించిన, అందిస్తున్న వీరంతా ప్రజా సేవలోనూ నిమగ్నం కానున్నారు. ఇదలావుంటే.. ఈ ఫలితాల్లో కొన్ని నియోజకవర్గాల్లో చిత్ర విచిత్రాలు చోటు చేసుకున్నాయి. ఓ చోట తండ్రి ఓడిపోగా, మరో చోట కొడుకు గెలుపొందారు. మల్కాజిగిరిలో కాంగ్రెస్ అభ్యర్థి మైనంపల్లి హన్మంతరావు, బీఆర్ఎస్ అభ్యర్థి మర్రి రాజశేఖర్ రెడ్డి చేతిలో ఓటమి పాలయ్యారు. ఆయన కుమారుడు రోహిత్ మెదక్ నుంచి బరిలో దిగి విజయం సాధించారు. ఓ చోట అన్నదమ్ములు గెలువగా, మరో చోట అన్నదమ్ములు ఓటమి చవి చూశారు. కోమటిరెడ్డి, గడ్డం సోదరులు ఈ ఎన్నికల్లో విజయం సాధించగా, ఎర్రబెల్లి సోదరులు ఓడిపోయారు. మంత్రిగా పని చేసిన ఎర్రబెల్లిని 26 ఏళ్లు కూడా నిండని కాంగ్రెస్ అభ్యర్థిని యశస్విని రెడ్డి ఓడించడం చర్చనీయాంశంగా మారింది. రాష్ట్రంలో ఈమెనే యంగెస్ట్ ఎమ్మెల్యే. ఎన్నికల్లో సుడిగాలి పర్యటనలతో ఓటర్లను ఆకట్టుకున్న ఈమె విజయాన్ని ఖరారు చేసుకున్నారు.

#telangana-elections-2023 #15-doctors #congress #assembly
Advertisment
తాజా కథనాలు