Telangana Elections: తెలంగాణ ఎన్నికల పోలింగ్‌పై అమిత్ షా ఆరా..

తెలంగాణ ఎన్నికల పోలింగ్ సరళిపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆరా తీశారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డికి ఫోన్ చేసి పోలింగ్‌పై వివరాలు అడిగి తెలుసుకున్నారు. బీజేపీ గెలిచే అవకాశం ఉన్న నియోజకవర్గాల వివరాలను తెలుసుకున్నారు.

New Update
Amith Sha: కేంద్రమంత్రికి కారు లేదంట..ఎన్నికల అఫిడవిట్‌లో అమిత్‌ షా ఆస్తుల వివరాలు

Telangana Election Polling: తెలంగాణ ఎన్నికల పోలింగ్.. ప్రధాన పార్టీలైన బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీని నెక్ట్స్ లెవల్‌లో టెన్షన్‌కు గురి చేస్తున్నాయి. ఈ క్రమంలోనే తెలంగాణ ఎన్నికల పోలింగ్ సరళిపై బీజేపీ(BJP) హైకమాండ్ రాష్ట్ర నాయకత్వాన్ని ఆరా తీసింది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డికి(Kishan Reddy) ఫోన్ చేశారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. బీజేపీకి వచ్చే ఓట్లు - సీట్ల అంచనాలపై ఆరా తీశారు అమిత్ షా. ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ, పసుపు బోర్డు ప్రకటన ఎఫెక్ట్ ఎలా ఉందని అడిగారు అమిత్ షా. అదేవిధంగా ప్రభుత్వ వ్యతిరేక ఓటు బీజేపీకి టర్న్ అయ్యిందా? లేదా? అని ఆరా తీశారు అమిత్ షా. విజయావకాశాలు ఉన్న నియోజకవర్గాల వివరాలు అడిగి తెలుసుకున్నారు షా.

తెలంగాణలో ఈసారి అధికారం చేపడతామని పూర్తి విశ్వాసంతో, గట్టి సంకల్పంతో పని చేసింది బీజేపీ. ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సహా మహా మహా నేతలందరూ వచ్చి తెలంగాణ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఎన్నికల వేళ తెలంగాణపై హామీల వర్షం కురిపించారు ప్రధాని మోదీ. పసుపు బోర్డు ఏర్పాటు అనేక కీలక ప్రకటనలు చేశారు. ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణకు కూడా అంగీకారం తెలిపారు. ఇవన్నీ బీజేపీకి మేలు చేస్తాయని, ఓట్లు పడేలా చేస్తాయని ఆశించింది బీజేపీ. ఆ నమ్మకంతోనే.. తాము ఈ ఎన్నికల్లో భారీ మెజార్టీతో విజయం సాధిస్తామని బీజేపీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. మరి బీజేపీ ఎన్ని స్థానాల్లో గెలుపొందుతుందో తెలియాలంటే.. డిసెంబర్ 3వ తేదీ వరకు ఆగాల్సిందే.

Also Read:

హైదరాబాద్ ఓటర్ల మొద్దు నిద్ర..ఇప్పటికీ కేవలం 13 శాతమే పోలింగ్!

మాదే అధికారమంటున్న కేటీఆర్, రాహుల్ గాంధీలు

Advertisment
తాజా కథనాలు