TG DSC Results: తెలంగాణ టీచర్ అభ్యర్థులకు అలర్ట్. మరో వారం రోజుల్లో డీఎస్సీ ఫలితాలు విడుదల చేసేందుకు తెలంగాణ సర్కార్ రంగం సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే ఫైనల్ కీ విడుదల చేసిన విద్యాశాఖ అభర్థులు అభ్యంతరాలను స్వీకరించింది. ఈ ప్రక్రియ కూడా పూర్తి కావడంతో మరో నాలుగైదు రోజుల్లో ఫైనల్ రిజల్ట్ రిలీజ్ చేయబోతున్నట్లు సమాచారం. అంతేకాదు త్వరలోనే జిల్లాల వారీగా మెరిట్ జాబితా వెల్లడించి.. ధ్రువపత్రాల పరిశీలన చేపట్టేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. సాధ్యమైనంత త్వరగా కొత్త టీచర్ల సేవలను వాడుకోవాలనే చూస్తోంది రేవంత్ సర్కార్.
డిప్యూటీ సీఎం భట్టి కీలక ప్రకటన..
ఇందులో భాగంగానే ఉపాధ్యాయుల దినోత్సవం సందర్భంగా డీఎస్సీ ఫలితాల విడుదలపై డిప్యూటీ సీఎం భట్టి కీలక ప్రకటన చేశారు. ఉపాధ్యాయుల దినోత్సవం సందర్భంగా ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. 11,062 ఉపాధ్యాయ ఖాళీల భర్తీ ప్రక్రియను వీలైనంత త్వరగా పూర్తి చేసి త్వరలోనే 6 వేల పోస్టులతో మరో డీఎస్సీ ప్రకటిస్తామన్నారు. ఇందులో భాగంగా ఇటీవల నిర్వహించిన డీఎస్సీ పరీక్షలకు సంబంధించిన ఫైనల్ కీని విద్యాశాఖ అధికారులు విడుదల చేసినట్లు భట్టి విక్రమార్క తెలిపారు. దీంతో ఈ వారంలోనే పరీక్ష ఫలితాలు విడుదల కాబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. దీనిపై విద్యాశాఖ అధికారిక ప్రకటన వెలువడలేదు.
మొత్తం 11,062 ఉపాధ్యాయ పోస్టులకు 2,79,957 దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో (87.61) శాతం 2,45,263 మంది పరీక్షలకు హాజరయ్యారు. 2,629 స్కూల్ అసిస్టెంట్, 727 భాషా పండితులు, 182 పీఈటీలు, 6,508 ఎస్జీటీలు, స్పెషల్ ఎడ్యుకేషన్ 220 స్కూల్ అసిస్టెంట్లు, 796 ఎస్జీటీ ఉద్యోగాలున్నాయి.