TS DSC: ఉద్యోగార్థులకు గుడ్ న్యూస్.. 11,062 పోస్టులను DSC నోటిఫికేషన్! తెలంగాణ ప్రభుత్వం ఇవాళ డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయనుంది. మొత్తం 11,062 ఖాళీలతో కొత్త నోటిఫికేషన్‌ను విడుదల చేయనుంది. ఈ పోస్టులలో గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం నోటిఫై చేసిన 5,089 ఖాళీలు కూడా ఉన్నాయి. పరీక్షలు మే/జూన్‌లో నిర్వహించే అవకాశం ఉంది. By Trinath 29 Feb 2024 in జాబ్స్ తెలంగాణ New Update షేర్ చేయండి Telangana DSC Notification: 5,089 ఉపాధ్యాయ పోస్టుల కోసం డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ (డీఎస్సీ)-2023 నోటిఫికేషన్‌ను పాఠశాల విద్యాశాఖ బుధవారం రద్దు చేసిన విషయం తెలిసిందే. అయితే ఇవాళ(ఫిబ్రవరి 29) 11,062 ఖాళీలతో కొత్త నోటిఫికేషన్‌ను విడుదల చేయనుంది. తాజా నోటిఫికేషన్‌లో 6,508 సెకండరీ గ్రేడ్ టీచర్లు (SGT), 2,629 స్కూల్ అసిస్టెంట్లు (SA), 727 లాంగ్వేజ్ పండిట్లు (LP), 182 ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్స్ (PET), 1,016 స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్లు 220 పోస్టులు, 79 SA క్యాడర్ కింద ఖాళీలు ఉంటాయి. ఈ పోస్టులలో గత బీఆర్‌ఎస్ (BRS) ప్రభుత్వం నోటిఫై చేసిన 5,089 ఖాళీలు కూడా ఉన్నాయి. గతంలో డీఎస్సీకి 1.77 లక్షల మంది అభ్యర్థుల నుంచి దరఖాస్తులు వచ్చాయి. మునుపటి నోటిఫికేషన్‌లో దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులందరికీ తాజా నోటిఫికేషన్‌లో వారి దరఖాస్తులు అటోమేటిక్‌గా అప్లై అవుతాయి . వారు మళ్లీ దరఖాస్తు చేయాల్సిన అవసరం లేదు. కంప్యూటర్ ఆధారిత పద్ధతిలో (Computer Based Exam) జరిగే రిక్రూట్‌మెంట్ పరీక్షలు మే/జూన్‌లో నిర్వహించే అవకాశం ఉంది. కొంతమంది అభ్యర్థులు SGT, SA లాంటి మల్టిపుల్ పోస్టులకు హాజరవుతారు, అందుకే వివిధ తేదీలలో నియామక పరీక్షలను నిర్వహించడానికి ప్లాన్ వేస్తున్నారు. గ్రూప్-1 విషయంలోనూ ఇంతే: అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ (Congress) ఇలా ఓ నోటిఫికేషన్ రద్దు చేసి అదనంగా జాబ్స్ సంఖ్యను పెంచి మరో నోటిఫికేషన్ రిలీజ్ చేయడం ఇది రెండోసారి. గ్రూప్-1 పరీక్షలకు కూడా ఇలానే చేసింది. 563 పోస్టులతో ఫిబ్రవరి 19న టీఎస్పీఎస్సీ కొత్త నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. అందులో వయోపరిమితిని 44 నుంచి 46 ఏళ్లకు పెంచింది రేవంత్ సర్కార్. మే లేదా జూన్‌లో ప్రిలిమినరీ పరీక్ష ఉండే అవకాశముంది. అలాగే సెప్టెంబర్ లేదా అక్టోబర్‌లో మెయిన్స్ పరీక్ష ఉండనున్నట్లు తెలుస్తుంది. అయితే గతంలో గ్రూప్-1 కు అప్లై చేసుకున్నవాళ్లు.. ఈసారి కూడా దరఖాస్తు చేసుకోవాలని TSPSC ఆదేశించింది. Also Read: రోగనిరోధక శక్తిని పెంచే ఈ 5రకాల పండ్లు తీసుకోండి.. రోగాలు మీ దరి చేరవు #telangana #jobs #telangana-dsc #ts-dsc మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి