Telangana Assembly: తెలంగాణ అప్పుల లెక్కలు ఇవే!

అసెంబ్లీ సమావేశాల్లో తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేసింది. కాగ్ రిపోర్ట్‌లోని అంశాలను నివేదికలో పెట్టినట్లు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. మొత్తం బడ్జెట్‌ వ్యయంలో ఆరోగ్యంపై ఖర్చు 5 శాతం మాత్రమే అని అన్నారు.

Telangana Assembly: తెలంగాణ అప్పుల లెక్కలు ఇవే!
New Update

Telangana Debts: తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రం విడుదల చేసింది రాష్ట్ర సర్కార్. 42 పేజీలతో శ్వేతపత్రం విడుదల చేసింది. 2014-23 మధ్య బడ్జెట్‌ కేటాయింపుల్లో వాస్తవ వ్యయం 82.3 శాతమే ఉందని పేర్కొంది. తెలంగాణలో మొత్తం అప్పులు రూ.6,71,757 కోట్లు ఉన్నట్లు వెల్లడించింది. తెలంగాణ ఏర్పడిన నాటికి రుణం రూ.72,658 కోట్లగా పేర్కొంది. పదేళ్లలో సగటున 24.5 శాతం రాష్ట్ర అప్పులు (Telangana Debts) పెరిగినట్లు తెలిపింది. ప్రభుత్వ కార్పొరేషన్లలో తీసుకున్న అప్పులు రూ.59 వేల 414 కోట్లు.. ఎస్పీవీల ద్వారా సేకరించిన రుణం లక్షా 27వేల కోట్లుగా పేర్కొంది.

ALSO READ: రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం.. నేడే అకౌంట్లోకి డబ్బులు జమ!

కాగ్ రిపోర్ట్‌లోని అంశాలను నివేదికలో పెట్టినట్లు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క (Bhatti Vikramarka) స్పష్టం చేశారు. మొత్తం బడ్జెట్‌ వ్యయంలో ఆరోగ్యంపై ఖర్చు 5 శాతం మాత్రమే అని అన్నారు. బడ్జెట్‌కు వాస్తవ వ్యయానికి 20 శాతం అంతరం ఉందన్న ప్రభుత్వం.. పదేళ్లలో చేసిన ఖర్చుకు అనుగుణంగా ఆస్తుల సృష్టి జరగలేదని కాంగ్రెస్ ప్రభుత్వం పేర్కొంది.

శ్వేత పత్రంలోని ముఖ్యంశాలు:-

* తెలంగాణ బడ్జెట్ కు వాస్తవ వ్యయానికి 20 శాతం అంతరం ఉంది.
* ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీల సంక్షేమ బడ్జెట్ అంచనాలకు వాస్తవ వ్యయాల మధ్య భారీ తేడా ఉంది.
* 2014-15 లో అప్పు 72,658 కోట్లు.
* ప్రస్తుతం 6, 71, 757 కోట్లకు అప్పు పెరిగింది.
* అది పదేళ్లలో ఖర్చు చేసిన నిధులకు అనుగుణంగా ఆస్తులు సృష్టించబడలేదు.
* రుణాలకు వడ్డీ చెల్లింపుల భారం రెవెన్యూ రాబడిలో 34 శాతానికి పెరిగింది.
* రెవెన్యూ రాబడిలో మరో 35% ఉద్యోగుల జీతాలు పెన్షన్లకు వెళ్ళింది.
* దీంతో పేద వర్గాల సంక్షేమ కార్యక్రమాలకు ఆర్థిక వెసులుబాటు తగ్గింది.
* 2014లో 100 రోజులకు సరిపడా బ్యాలెన్స్ ఉండేది.
* ప్రస్తుత పరిస్థితి పది రోజులకు తగ్గింది.
* విద్య వైద్య రంగాలకు సరైన నిధులు ఖర్చు చేయలేకపోయింది.
* రోజువారి ఖర్చులకు కూడా ఆర్బిఐ పై ఆధారపడాల్సిన పరిస్థితి వచ్చింది
* 2014లో మిగులు రాష్ట్రంగా ఉన్న తెలంగాణ ఇప్పుడు అప్పుల ఊబిలో కూరుకుపోయింది
* బడ్జెటేతర రుణాలు పెరగడమే ఈ పరిస్థితికి కారణం.

ALSO READ: తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. మాస్కు తప్పనిసరి!

#telugu-latest-news #breaking-news #telangana-assembly #telangana-debts
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe