Gangula Kamalakar: మంత్రి గంగుల కమలాకర్‌కు హైకోర్టులో ఊరట!

2018 గంగుల కమలాకర్ ఎన్నిక చెల్లదంటూ కాంగ్రెస్ నేత, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ దాఖలు చేసిన పిటిషన్‌ను తెలంగాణ హైకోర్టు కొట్టేసింది. దీనిపై గంగుల స్పందిస్తూ.. తన ఎన్నిక విషయంలో చివరికీ న్యాయమే గెలిచిందంటూ హర్షాన్ని వ్యక్తం చేశారు.

Gangula Kamalakar: మంత్రి గంగుల కమలాకర్‌కు హైకోర్టులో ఊరట!
New Update

మంత్రి గంగులకమలాకర్(Gangula Kamalakar)కు తెలంగాణ హైకోర్టు బిగ్ రిలీఫ్ ఇచ్చింది. 2018లో కరీంనగర్ ఎమ్మేల్యేగా గంగుల కమలాకర్ పరిమితికి మించి ఖర్చు చేశారని ఎన్నిక రద్దు చేయాలనీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు కాంగ్రెస్ నేత, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్(Ponnam Prabhakar). దీనిని విచారించిన ధర్మాసనం సరైన ఆధారాలు లేవంటూ పొన్నం దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టివేసింది. ఆ ఎన్నిక చెల్లుతుందని ప్రకటించి పొన్నంకు షాక్ ఇచ్చింది. మరోవైపు తెలంగాణ బీజేపీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్(Bandi Sanjay) కూడా గంగుల ఎన్నికను రద్దు చేయాలంటూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై హైకోర్టు గురువారం విచారణ జరపనుంది.

Also Read: విద్యార్థులకు GOOD NEWS.. సెలవులు పెంపు!

కోర్టు తీర్పుపై మంత్రి గంగుల రియాక్షన్:

ఎన్నికల నామినేషన్ పర్వం కొనసాగుతోంది. ఈరోజు కరీంనగర్ నుంచి పోటీ చేసే బిఆర్ఎస్(BRS) అభ్యర్థిగా పోటీ చేసేందుకు మంత్రి గంగుల కమలాకర్ నామినేషన్ వేశారు. అనంతరం తన ఎన్నిక చెల్లదంటూ దాఖలైన పిటిషన్‌పై హైకోర్టు ఇచ్చిన తీర్పుపై ఆయన స్పందించారు. గంగుల కమలాకర్ మాట్లాడుతూ.." తాను నామినేషన్ వేసేరోజే హైకోర్టు తనకు ఫెవర్‌గా తీర్పు ఇవ్వడం శుభసూచకం అని హర్షం వ్యక్తం చేశారు. 2018 ఎన్నికల్లో ప్రజల మద్దతుతో తానుగెలిచానని.. అది ఓర్వలేక ప్రతిపక్షాలు తనపై తప్పుడు ప్రచారాలు చేస్తున్నాయని గంగుల మండిపడ్డారు. తన విషయంలో న్యాయమే గెలిచిందని అన్నారు. కరీంనగర్ ప్రజల ఆశీర్వాదాలతో ఇప్పటివరకు మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచి అసెంబ్లీకి వెళ్ళాను అని అన్నారు. కరీంనగర్ ప్రజలకు జీవితాంతం అండగా ఉంటానని తెలిపారు. ఈ ఎన్నికల్లో కరీంనగర్ నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ తరఫున గంగుల కమలాకర్, కాంగ్రెస్ తరఫున పురుమళ్ల శ్రీనివాస్, బీజేపీ తరఫున బండి సంజయ్ ఎమ్మెల్యేగా పోటీ చేసే అభ్యర్థులుగా బరిలో దిగనున్నారు.

Also Read: కేసీఆర్ కు తప్పిన ప్రమాదం!

#telangana-elections-2023 #gangula-kamalakar #telangana-highcourt
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe