Telangana Constable Appointment Letters: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇవాళ(ఫిబ్రవరి 14న) సాయంత్రం 4 గంటలకు ఎల్బీ స్టేడియంలో (LB Stadium) 15,750 మంది పోలీసు కానిస్టేబుళ్లకు నియామక పత్రాలను అందజేయనున్నారు. ఈ 15,750 మంది అభ్యర్థులు తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు (TSLPRB) ద్వారా 16,604 నోటిఫైడ్ ఖాళీలకుగానూ రిక్రూట్‌మెంట్ డ్రైవ్‌లో ఎంపికయ్యారు. అక్టోబర్ 2023లో, TSLPRB SCT PC, ఇతర ఖాళీల కోసం రిక్రూట్‌మెంట్ డ్రైవ్ తుది ఫలితాన్ని ప్రకటించింది. అటు ఫిబ్రవరి 12వ తేదీ సోమవారం నాడు జరిగిన కమిటీ సమావేశంలో పోలీసు రిక్రూట్‌మెంట్‌పై జీఓ 46ను రద్దు చేసే అవకాశాలపై కూడా రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) చర్చించారు.
హైకోర్టు తీర్పు తర్వాత:
నాలుగు వారాల్లోగా పోలీసు కానిస్టేబుల్ పోస్టుల ఎంపిక ప్రక్రియను ప్రారంభించాలని తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు (టీఎస్‌ఎల్‌పీఆర్‌బీ) ని తెలంగాణ హైకోర్టు గత జనవరి 5న ఆదేశించింది. న్యాయమైన, వేగవంతమైన రిక్రూట్‌మెంట్ కోసం ఎదురుచూస్తున్న వేలాది మంది ఔత్సాహిక అధికారులకు ఈ తీర్పు పెద్ద ఉపశమనం కలిగించింది. ఎంపిక ప్రక్రియను వేగవంతం చేయాలని మరియు పరీక్షకు సంబంధించి అభ్యర్థులు లేవనెత్తిన అన్ని అభ్యంతరాలను పరిష్కరించాలని TSLPRBని హైకోర్టు ఆదేశించింది.
మరోవైపు రేవంత్ రెడ్డి ఉద్యోగాలపై దృష్టి పెట్టినట్టుగా తెలుస్తోంది. అధికారంలోకి వచ్చిన నాటి నుంచి TSPSCతో పాటు ఇతర ప్రభుత్వ ఉద్యోగాలకు(Government Jobs) సంబంధించిన బోర్డులు, నోటిఫికేషన్లపై రేవంత్ అనేకసార్లు ప్రకటనలు చేస్తూ వస్తున్నారు. 2లక్షల ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వం (Congress Govt) తీసుకుంటుందని చెబుతున్నారు. అటు డిసెంబరు 2024 నాటికి తెలంగాణలో 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేయాలన్న ప్రభుత్వ నిబద్ధతలో భాగంగా పలుశాఖల పోస్టుల సంఖ్యను పెంచినట్టుగా అర్థమవుతోంది.
Also Read: రేవంత్ ప్రేమ ‘గీతం’..🥰😘 వాళ్లది లవ్ ఎట్ ఫస్ట్ సైట్!
WATCH: