TG Constable: కానిస్టేబుల్ అభ్యర్థులకు తప్పని నిరాశ.. మరో ఏడాది ఆగాల్సిందేనా?

తెలంగాణలో కానిస్టేబుల్ ఉద్యోగాల ప్రక్రియ మరింత ఆలస్యం కానుంది. కాంగ్రెస్ ప్రభుత్వం రిలీజ్ చేసిన జాబ్ క్యాలెండర్‌లో 2025 ఏప్రిల్‌లో నోటిఫికేషన్ తేది వెల్లడించింది. అయితే లాస్ట్ నోటిఫికేషన్ 2022లో వెలువడగా.. 2025 వరకూ వేచి చూడటంపై అభ్యర్థులు నిరాశకు గురువుతున్నారు.

TG Constable: కానిస్టేబుల్ అభ్యర్థులకు తప్పని నిరాశ.. మరో ఏడాది ఆగాల్సిందేనా?
New Update

TG Constable: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగాల భర్తీపై ప్రత్యేక ఫోకస్ పెట్టింది. అసెంబ్లీ ఎన్నికల సమయంలో రాష్ట్రంలో 2 లక్షల పోస్టులు భర్తీ చేస్తామని రేవంత్ హామీ ఇచ్చారు. ఇందులో భాగంగానే బీఆర్ఎస్ ప్రభుత్వంలో విడుదలైన నోటిఫికేషన్లను కొనసాగిస్తూ పరీక్షలు నిర్వహిస్తోంది రేవంత్ సర్కార్. ఇప్పటికే గ్రూప్-1, 4 తోపాటు డీఎస్సీ, తదితర డిపార్ట్స్ మెంట్స్ కు సంబంధించి పరీక్షలు నిర్వహించింది. త్వరలోనే గ్రూప్ 2,3తోపాటు పలు భర్తీలకోసం పరీక్షలు నిర్వహించేందుకు తేదీలు ఖరారు చేసింది. ఇందులో భాగంగానే ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం శుక్రవారం అసెంబ్లీ వేదికగా జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసింది. ఉద్యోగాలు, పరీక్షలు, తేదీలతో సహా స్పష్టంగా జాబ్ క్యాలెండర్ లో పేర్కొంది. అయితే ఇందులో కానిస్టేబుల్ నియామకాలకు సంబంధించి ప్రభుత్వం సరైన స్పష్టతనివ్వలేదు. ఎన్ని పోస్టులతో కానిస్టేబుల్ ఉద్యోగ ప్రకటన చేస్తామని విషయాన్ని పేర్కొనకపోవడంతో పోలీస్ కావాలని కలలు కంటున్న అభ్యర్థుల్లో ఆందోళన మొదలైంది.

ఏప్రిల్-2025న నోటిఫికేషన్ విడుదల..
ఈ మేరకు ఎస్ఐ ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ ఏప్రిల్-2025న విడుదల చేసి ఆగస్టులో పరీక్ష నిర్వహిస్తామని జాబ్ క్యాలెండర్ లో పేర్కొంది. అలాగే కానిస్టేబుల్ నోటిఫికేషన్ సైతం ఏప్రిల్ లో విడుదల చేసి ఆగస్టులో ప్రిలిమినరీ పరీక్ష నిర్వహించనున్నట్లు తెలిపింది. అయితే ఎన్ని పోస్టులతో నోటిఫికేషన్ వేస్తారనే విషయంలో క్లారిటీ ఇవ్వకపోగా.. దాదాపు 9 నెలలపాటు ఎలాంటి రిక్రూట్ మెంట్ చేపట్టకపోవడంపై అభ్యర్థులు నిరాశకు గురవుతున్నారు. 2022లో తెలంగాణలో సివిల్‌, AR తదితర 16,604 పోస్టుల కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీకి పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు నోటిఫికేషన్ విడుదల చేసి, పరీక్షలు నిర్వహించింది. ఇందులో 15,640 మంది అభ్యర్థులను ఎంపిక చేసింది. ఈ TSLPRB కానిస్టేబుల్ ఫలితాలను అక్టోబర్‌ 4న విడుదల చేసింది. అయితే 2022 నుంచి 2025 వరకూ నోటిఫిషన్ లేకపోవడంపై కానిస్టేబుల్ అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు.

ఇది కూడా చదవండి: Cloudbursts: దేశంలో ప్రకృతి వైపరిత్యాలు.. మానవ తప్పిదాలేనా? క్లౌడ్ బరస్ట్ శాతం ఎంత!

అయితే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే 7 వేల ఉద్యోగాలు ఇచ్చామని, మరో 15 రోజుల్లోనే 15 వేల కానిస్టేబుల్‌ పోస్టులు భర్తీ చేస్తామని హామీ ఇచ్చారు. పోలీసు ఉద్యోగాల కోసం వేచి చూసే అభ్యర్థులకు సంబంధించి నియామక ప్రక్రియ త్వరలోనే చేపడతామన్నారు. అందుకు సంబంధించిన నోటిఫికేషన్ త్వరలోనే విడుదల చేసే బాధ్యత మంత్రి వర్గం తీసుకుంటుంది అని చెప్పారు. అందుకు అనుగుంగానే కొంతమందికి నియామక పత్రాలు అందజేశారు సీఎం రేవంత్. కానీ రాబోయే కొత్త ఉద్యోగాల కోసం మరీ ఇంత ఆలస్యంగా 2025 వరకూ వాయిదా వేయడంపై అభ్యర్థుల ఆశలు ఆవిరైపోయాయని అసహనం వ్యక్తం చేస్తున్నారు.

#telangana-constable #job-notification-2025 #congress-job-calendar
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe