T-Congress War Room: గెలుపే లక్ష్యంగా తెలంగాణ కాంగ్రెస్ వార్ రూమ్.. ఇక్కడి నుంచి ఏం చేస్తారో తెలుసా?

రానున్న ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ వార్ రూమ్ ను ఏర్పాటు చేసింది. ఈ వార్ రూమ్ నుంచే క్షేత్ర స్థాయి శ్రేణులకు, నాయకులకు ఎప్పటికప్పుడు సూచనలు చేయనున్నారు.

New Update
T-Congress War Room: గెలుపే లక్ష్యంగా తెలంగాణ కాంగ్రెస్ వార్ రూమ్.. ఇక్కడి నుంచి ఏం చేస్తారో తెలుసా?

రానున్న ఎన్నికల్లో ఎలాగైనా అధికారం దక్కించుకోవాలని భావిస్తోన్న కాంగ్రెస్ (Telangana Congress) పార్టీ ఆ దిశగా వ్యూహాలకు పదును పెడుతోంది. ముఖ్యంగా ఇతర పార్టీల్లో అసంతృప్తులకు గాలం వేసే పనిలో నిమగ్నమైంది. అందులో భాగంగానే ఇప్పటికే తుమ్మల నాగేశ్వరరావు, కుంభం అనిల్ కుమార్ రెడ్డి లాంటి నేతలు కాంగ్రెస్ లో చేరిపోయారు. అయితే.. కేవలం చేరికలు మాత్రమే కాకుండా ప్రజల్లోకి తమ హామీలు అమలు చేయడం, ప్రచారంలో స్పీడ్ పెంచడం లాంటి అంశాలపై కూడా ఫోకస్ పెట్టింది హస్తం పార్టీ. ఇందు కోసం తాజాగా వార్ రూంను ప్రారంభించింది. గాంధీ భవన్ లో ఏర్పాటు చేసిన ఈ వార్ రూంను పార్టీ ఇంఛార్జ్ మాణిక్ రావ్ ఠాక్రే ఈ రోజు ప్రారంభించారు.

ఈ కార్యక్రమానికి సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, మహేష్ కుమార్ గౌడ్ ,ప్రేమ్ సాగర్ రావు, పొన్నం ప్రభాకర్ తదితర ముఖ్య నేతలు హాజరయ్యారు. నేటి నుంచి ఎన్నికలు పూర్తయ్యే వరకు ఈ వార్ రూమ్ యాక్టివ్ గా ఉండనుంది. వార్ రూమ్ నుంచే ఎన్నికల వ్యూహాల అమలు చేయనున్నారు. ఇంకా బూత్ లెవల్ నుంచి మానిటరింగ్, సోషల్ మీడియా వింగ్ కు ఎప్పటికప్పుడు సందేశాలు ఇక్కడి నుంచే వెళ్లనున్నాయి. ప్రచారంలో జరుగుతున్న లోపాలను సైతం ఇక్కడి నుంచి క్షేత్ర స్థాయికి సమాచారం అందించనున్నారు.

ఎన్నికల వ్యూహకర్త సునీల్ కనుగోలు టీం ఇచ్చే ఇన్ పుట్స్ ను కూడా ఈ వార్ రూమ్ నుంచే అభ్యర్థులకు చేరవేయనుంది కాంగ్రెస్ నాయకత్వం. ఒక వేళ బయట ఈ వార్ రూమ్ ను ఏర్పాటు చేస్తే పోలీసు దాడులు ఉండే అవకాశం ఉన్న నేపథ్యంలో వ్యూహాత్మకంగా గాంధీభవన్ ఆవరణలోని ఇందిరాభవన్ లోనే ఏర్పాటు చేశారు.

ఇది కూడా చదవండి:
Mynampally Hanumanth Rao: వస్తే దగ్గరుండి ఓడిస్తాం.. మల్కాజ్‌గిరి కాంగ్రెస్‌లో ‘మైనంపల్లి’ రచ్చ..

Advertisment
తాజా కథనాలు