Congress PAC Meeting: ఎన్నికల తర్వాత నేడు తొలిసారి కాంగ్రెస్ పీఏసీ భేటీ.. వారికి ఎమ్మెల్సీ, నామినేటెడ్ పదవులు?

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ విజయం తర్వాత ఆ పార్టీ రాజకీయ వ్యవహారల కమిటీ ఈ రోజు గాంధీ భవన్ లో సమావేశమైంది. ఈ సమావేశంలో ఎమ్మెల్సీ పదవులు, నామినేటెడ్ పోస్టుల భర్తీపై చర్చిస్తున్నట్లు సమాచారం.

Congress PAC Meeting: ఎన్నికల తర్వాత నేడు తొలిసారి కాంగ్రెస్ పీఏసీ భేటీ.. వారికి ఎమ్మెల్సీ, నామినేటెడ్ పదవులు?
New Update

Telangana Congress PAC Meeting: అసెంబ్లీ ఎన్నికల్లో (Telangana Elections 2023) విజయం తర్వాత తొలిసారి ఈ రోజు గాంధీభవన్ లో టీపీసీసీ రాజకీయ వ్యవహారాల కమిటీ (PAC) సమావేశం జరుగుతోంది. ఏఐసీసీ ఇంఛార్జ్ మాణిక్ రావు ఠాక్రే (Manikrao Thakare) అధ్యక్షతన జరుగుతున్న ఈ సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy), ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, కన్వీనర్ షబ్బీర్ అలీ, వీ. హనుమంతరావు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్, కాంగ్రెస్ పార్టీని తెలంగాణలో అధికారంలోకి తీసుకువచ్చి సంపూర్ణ మద్దతు పలికిన తెలంగాణ రాష్ట్ర ప్రజలకు, కాంగ్రెస్ పార్టీ విజయం కోసం అహర్నిశలు కృషి చేసిన కార్యకర్తలు, నాయకులు, ఏఐసీసీ అగ్ర నేతలు, ప్రచారం లో పాల్గొన్న నాయకులు, ఇంఛార్జ్ లు గా పని చేసిన ప్రతీ ఒక్కరికీ కాంగ్రెస్ పార్టీ తరఫున ధన్యవాదాలు చెబుతూ తీర్మానం ప్రవేశపెట్టారు.

ఇది కూడా చదవండి: Minister Ponguleti: సంక్రాంతిలోగా ఇందిరమ్మ ఇండ్లు.. ఈ నెల 28 మరో 2 గ్యారెంటీలు: మంత్రి పొంగులేటి శుభవార్త

ఈ తీర్మానాన్ని సమావేశానికి హాజరైన అందరూ ఏకగ్రీవంగా ఆమోదించారు. అయితే ఈ సమావేశంలో రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో జరగనున్న పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో అనుసరించనున్న వ్యూహాలపై చర్చించనున్నట్లు సమాచారం. గత ఎన్నికల్లో టికెట్ దక్కని నేతలకు నామినేటెడ్, ఎమ్మెల్సీ పదవులు ఇచ్చే అంశంపై కూడా చర్చించనున్నట్లు వార్తలు వస్తున్నాయి.

ఎమ్మెల్సీ పదవుల లిస్ట్ లో.. తుంగతుర్తి టికెట్ వదులుకున్న అద్దంకి దయాకర్ పేరు ప్రముఖంగా వినిపిస్తుంది. మైనార్టీ కోటాలో షబ్బీర్ అలీ, హఫీజ్ ఖాన్ రేసులో ఉన్నారు. గత ఎన్నికల సమయంలో మల్కాజ్ గిరి, సికింద్రాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్లలో ఒక్క అసెంబ్లీ సీటులోనూ కాంగ్రెస్ గెలవకపోవడంతో.. అక్కడి నేతలకు ఎమ్మెల్సీ ఇవ్వాలన్న చర్చ కూడా ఉంది. మల్కాజ్ గిరి మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావుకు గ్రేటర్ కోటాలో ఎమ్మెల్సీ దక్కే అవకాశం ఉందన్న చర్చ సాగుతోంది.

#telangana-congress #congress #cm-revanth-reddy
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe