Telangana Congress: తెలంగాణ కాంగ్రెస్ సెకండ్ లిస్ట్ విడుదల.. తుమ్మల, పొంగులేటి పోటీపై క్లారిటీ..

తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థుల సెకండ్ లిస్ట్ విడుదలైంది. 45 మంది అభ్యర్థులకు సీట్లు కన్ఫామ్ చేస్తూ జాబితా విడుదల చేసింది కాంగ్రెస్ అధిష్టానం. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, పొన్నం ప్రభాకర్, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, మధుయాష్కి గౌడ్, కొండా సురేఖ సహా ఇతర ముఖ్య నేతలకు ఈ జాబితాలో సీట్ కన్ఫామ్ చేశారు.

Telangana Congress: తెలంగాణ కాంగ్రెస్ సెకండ్ లిస్ట్ విడుదల.. తుమ్మల, పొంగులేటి పోటీపై క్లారిటీ..
New Update

Telangana Elections: తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే(Congress) అభ్యర్థుల సెకండ్ లిస్ట్ విడుదలైంది. 45 మంది అభ్యర్థులకు సీట్లు కన్ఫామ్ చేస్తూ జాబితా విడుదల చేసింది కాంగ్రెస్ అధిష్టానం. ఈ లిస్ట్‌లో చాలా మంది కీలక నేతల పేర్లు ఉండటంతో.. ఇప్పటి వరకు కొనసాగిన సస్పెన్స్‌కు తెర పడినట్లయ్యింది. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి పాలేరు, తుమ్మల నాగేశ్వరరరావు - ఖమ్మం, మునుగోడు - కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సహా పలువురు కీలక నేతలకు సీట్లు కేటాయించింది. ఎల్బీనగర్ - మధుయాష్కి, గద్దర్ బిడ్డకు కూడా సీటు కన్ఫామ్ చేసింది కాంగ్రెస్. గద్దర్ కూతురు వెన్నెలకు కంటోన్మెంట్ సీటును కేటాయించింది కాంగ్రెస్. ఖైరతాబాద్ సీటును పీజేఆర్ కూతురు విజయారెడ్డికి కేటాయించారు.

మొదటి విడతలో 55 సీట్లకు అభ్యర్థులను ఖరారు చేసిన కాంగ్రెస్.. రెండవ విడతలో 45 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. మొత్తంగా ఇప్పటి వరకు 100 నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించింది కాంగ్రెస్ అధిష్టానం. ఇంకా 19 సీట్లకు మాత్రమే అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. వీటిలో అత్యంత కీలకమైన, కేసీఆర్ పోటీ చేస్తున్న కామారెడ్డికి సంబంధించి అభ్యర్థిని మాత్రం ఇంకా ఖరారు చేయలేదు కాంగ్రెస్. కామారెడ్డి నుంచి కేసీఆర్ పై తాను పోటీకి సిద్ధమంటూ టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ప్రకటించిన నేపథ్యంలో.. ఈ సీటును వెకెన్సీలో ఉంచినట్లు తెలుస్తోంది. ఇక వర్ధన్నపేట సీటును నిజామాబాద్ మాజీ పోలీస్ కమిషనర్ నాగరాజుకు కేటాయించింది.

తెలంగాణ కాంగ్రెస్ సెకండ్ లిస్ట్ లోని అభ్యర్థులు వీరే..

☛ సిర్పూర్ - రావి శ్రీనివాస్

☛ అసిఫాబాద్(ఎస్టీ) - అజ్మీరా శ్యామ్

☛ ఖానాపూర్(ఎస్టీ) - వెద్మ భొజ్జు

☛ ఆదిలాబాద్ - కంది శ్రీనివాస్ రెడ్డి

☛ బోథ్ (ఎస్టీ) - వెన్నెల అశోక్

☛ ముథోల్ - భోస్లే నారాయణ్ రావు పాటిల్

☛ ఎల్లారెడ్డి - కే. మదన్ మోహన్ రావు

☛ నిజామాబాద్ రూరల్ - డా. రేకుపల్లి భూపతి రెడ్డి

☛ కోరుట్ల - జువ్వాడి నర్సింగ రావు

☛ చొప్పదండి(ఎస్సీ) - మేడిపల్లి సత్యం

☛ హుజూరాబాద్ - వొడితల ప్రణవ్

☛ హుస్నాబాద్ - పొన్నం ప్రభాకర్

☛ సిద్దిపేట - పూజల హరికృష్ణ

☛ నర్సాపూర్ - ఆవుల రాజిరెడ్డి

☛ దుబ్బాక - చెఱుకు శ్రీనివాస్ రెడ్డి

☛ కూకట్‌పల్లి - బండి రమేష్

☛ ఇబ్రహీపట్నం - మల్‌రెడ్డి రంగారెడ్డి

☛ ఎల్బీనగర్ - మధుయాష్కి గౌడ్

☛ మహేశ్వరం - కిచ్చన్నగారి లక్ష్మారెడ్డి

☛ రాజేంద్రనగర్ - కస్తూరి నరేందర్

☛ శేరిలింగంపల్లి - వి. జగదీశ్వర్ గౌడ్

☛ తాండూర్ - బుయ్యని మనోహర్ రెడ్డి

☛ అంబర్ పేట్ - రోహిన్ రెడ్డి

☛ ఖైరతాబాద్ - పి. విజయా రెడ్డి

☛ జూబ్లీహిల్స్ - మహ్మద్ అజారుద్దీన్

☛ సికింద్రాబాద్ కంటోన్మెంట్ - డా.జి.వి వెన్నెల

☛ నారాయణపేట్ - డా. పర్ణిక చిట్టెం రెడ్డి

☛ మహబూబ్‌నగర్ - యెన్నెం శ్రీనివాస్ రెడ్డి

☛ జడ్చెర్ల - జె. అనురుధ్ రెడ్డి

☛ దేవరకద్ర - గవినొన్న మధుసూదన్ రెడ్డి

☛ మక్తల్ - వాకిటి శ్రీహరి

☛ వనపర్తి - డా. గిల్లెల చిన్నారెడ్డి

☛ దేవరకొండ(ఎస్టీ) - నెనావత్ బాలు నాయక్

☛ మునుగోడు - కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి

☛ భువనగిరి - కుంభం అనిల్ కుమార్ రెడ్డి

☛ జనగాం - కొమ్మూరి ప్రతాప్ రెడ్డి

☛ పాలకుర్తి - యశశ్విని మేమిడిల

☛ మహబూబాబాద్ (ఎస్టీ) - డా. మురళీ నాయక్

☛ పరకాల - రేవూరి ప్రకాష్ రెడ్డి

☛ వరంగల్ వెస్ట్ - నాయిని రాజేందర్ రెడ్డి

☛ వరంగల్ ఈస్ట్ - కొండా సురేఖ

☛ వర్ధన్నపేట (ఎస్సీ) - కెఆర్ నాగరాజు

☛ పినపాకక (ఎస్టీ) - పాయం వెంకటేశ్వర్లు

☛ ఖమ్మం - తుమ్మల నాగేశ్వరరావు

☛ పాలేరు - పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థుల సెకండ్ లిస్ట్ కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.. 

Also Read:

ఖాళీ కడుపుతో దాల్చిన చెక్క నీటిని తాగితే 5 అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు..

పదవి విరమణ తరువాత నెలవారీగా పెన్షన్ పొందాలనుకుంటున్నారా? ఈ పథకం బెస్ట్!

#telangana-elections #telangana-congress #congress-party
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe