TS Congress: గెలుపే లక్ష్యం.. ఈ నెల 15 నుంచి తెలంగాణలోనే రాహుల్, ప్రియాంక మకాం!

ఎన్నికలకు ముందు 15 రోజులు అగ్రనేతలు రాష్ట్రాన్ని చుట్టేసేలా ప్రణాళికలు రూపొందిస్తోంది హస్తం పార్టీ. ఇందులో భాగంగా ఈ నెల 15 నుంచి 28 వరకు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ ప్రతీ జిల్లా కవర్ అయ్యేలా ప్రచారం నిర్వహించనున్నారు.

TS Congress: గెలుపే లక్ష్యం.. ఈ నెల 15 నుంచి తెలంగాణలోనే రాహుల్, ప్రియాంక మకాం!
New Update

తెలంగాణలో గెలుపే లక్ష్యంగా ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ (Congress Party) వ్యూహాలు రచిస్తోంది. ముఖ్యంగా ఆ పార్టీ అగ్రనేతలు రాష్ట్రంపై ఫుల్ ఫోకస్ పెట్టారు. రాహుల్ గాంధీ (Rahul Gandhi), ప్రియాంక గాంధీ (Priyanka Gandhi) ఏకంగా వరుసగా 14 రోజుల పాటు రాష్ట్రంలోనే మకాం వేసి ప్రచారాన్ని హోరెత్తించనున్నారు. ఈ నెల 15 నుంచి 28వ తేదీ వరకు వీరి పర్యటన షెడ్యూల్ ను ఖరారు చేశారు. దాదాపు ప్రతీ జిల్లా, ప్రతీ నియోజకవర్గాన్ని టచ్ చేసేలా వీరి పర్యటన ఉండే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు రాష్ట్ర నాయకులు రూట్ మ్యాప్ ను రూపొందించే పనిలో నిమగ్నమయ్యారు.
ఇది కూడా చదవండి: Telangana Election 2023: కాళేశ్వరం ప్రాజెక్ట్ కాదు.. కాంట్రాక్టర్ల ప్రాజెక్ట్‌: కోదండరామ్

తెలంగాణలో పార్టీ గెలిచే అవకాశం ఉందని అంచనాకు వచ్చిన హైకమాండ్ ఎట్టి పరిస్థిల్లోనూ అవకాశాన్ని వదులుకోవద్దని భావిస్తోంది. దీంతో ప్రతీ విషయంలోనూ జాగ్రత్తగా వ్యవహరిస్తోంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే 100 మంది అభ్యర్థులను ఖరారు చేసింది. మరో 19 మంది అభ్యర్థులతో ఫైనల్ లిస్ట్ నేడు లేదా రేపు విడుదలయ్యే అవకాశం ఉంది. ఓ వైపు అభ్యర్థుల లిస్ట్ పై కసరత్తు చేస్తూనే మరో వైపు రాష్ట్రంలో ప్రచారాన్ని మాత్రం ఆపడం లేదు హైకమాండ్. ఇప్పటికే రాహుల్ గాంధీ, మల్లికార్జున్ ఖర్గే, డీకే శివకుమార్ రాష్ట్రంలో పర్యటించారు.
ఇది కూడా చదవండి: Election King: కేసీఆర్‌పైనే పోటీ..! రాహుల్‌, పీవీ, కరుణానిధి, జయలలితతోనూ తలపడ్డ ఈ ఎలక్షన్‌ కింగ్ ఎవరూ?

ఇదిలా ఉంటే.. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిని కామారెడ్డిలో సీఎం కేసీఆర్ పై పోటీకి దించాలని కాంగ్రెస్ హైకమాండ్ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ఈ నెల 10న కామారెడ్డిలో నిర్వహించనున్న బీసీ డిక్లరేషన్ సభలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే రేవంత్ పేరును స్వయంగా ప్రకటిస్తారని పార్టీలో చర్చ సాగుతోంది. అదే రోజు భారీ ర్యాలీతో నామినేషన్ కార్యక్రమం ఉంటుందని తెలుస్తోంది.

#congress #rahul-gandhi #telangana-elections-2023 #priyanka-gandhi #telangana-politics
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe