/rtv/media/post_attachments/wp-content/uploads/2023/12/TS-Congress-1-1-jpg.webp)
Abhaya Hastham Form: తెలంగాణలో ఈ రోజు నుంచి కాంగ్రెస్ ప్రభుత్వ (Congress Government) అభయహస్తం గ్యారెంటీలకు సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైన విషయం తెలిసిందే. అయితే.. కొన్ని చోట్ల ఈ అప్లకేషన్ ఫామ్ లను జిరాక్స్ సెంటర్లలో భారీ ధరలకు విక్రయిస్తున్నారన్న ప్రచారం సాగుతోంది. దీంతో కాంగ్రెస్ పార్టీ కీలక ప్రకటన విడుదల చేసింది. అభయ హస్తం గ్యారంటీలకు సంబంధించిన అప్లికేషన్ ఫామ్ లు గ్రామపంచాయతీ మరియు పట్టణ వార్డు కార్యాలయాలలో ఉచితంగా లభిస్తాయని కాంగ్రెస్ పార్టీ ప్రకటనలో తెలిపింది.
ఇది కూడా చదవండి: Minister Seethakka: మేడం కాదు.. సీతక్క అని పిలవండి.. అధికారులకు మంత్రి సూచన..
ప్రజాపాలన:
అభయ హస్తం గ్యారంటీలకు సంబంధించిన అప్లికేషన్ ఫామ్ లు గ్రామపంచాయతీ మరియు పట్టణ వార్డు కార్యాలయాలలో ఉచితంగా లభించును.ప్రజలు ఎవరూ కూడా అధిక రుసుముతో ఫాంలను కొని మోసపోవద్దని విజ్ఞప్తి చేస్తున్నాము.
ప్రభుత్వం పారదర్శకంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నది. కావున ప్రజలు… pic.twitter.com/x5CeEuiiSS
— Telangana Congress (@INCTelangana) December 28, 2023
ఈ దరఖాస్తు ఫామ్ లను ప్రజలు ఎవరూ కూడా అధిక రుసుముతో ఫాంలను కొని మోసపోవద్దని విజ్ఞప్తి చేసింది. ప్రభుత్వం పారదర్శకంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తోందని వెల్లడించింది. ప్రజలు అప్రమత్తంగా ఉండి అధికారుల ద్వారా పూర్తి వివరాలు తెలుసుకుని మీయొక్క దరఖాస్తు ఫాంను మరియు పత్రాలను సంబంధిత అధికారులకు సమర్పించాలని కోరింది. ఈ మేరకు ట్విట్టర్ (X) లో ప్రకటన విడుదల చేసింది తెలంగాణ కాంగ్రెస్ పార్టీ.
ఇదిలా ఉంటే ఈ రోజు రాష్ట్రవ్యాప్తంగా అభయహస్తం గ్యారెంటీలకు సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. దరఖాస్తు చేసుకోవడానికి ప్రజలు కార్యాలయాల వద్ద బారులు దీరారు. అయితే.. ఈ దరఖాస్తులను సరిపడా అందుబాటులో ఉంచలేదన్న విమర్శలు పలు చోట్ల వచ్చాయి. ఇదే అదనుగా జిరాక్స్ షాపుల నిర్వాహకులు అధిక ధరలకు ఈ దరఖాస్తులను విక్రయించారన్న ప్రచారం సాగింది.