Auto Drivers Strike: తెలంగాణలోని ఆటో డ్రైవర్లకు రేవంత్ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. సచివాలయంలో ఆటో కార్మిక సంఘాలతో మంత్రి పొన్నం ప్రభాకర్ సమావేశం అయ్యారు. ఆటో కార్మికుల సమస్యలపై మంత్రి పొన్నం ప్రభాకర్ వారితో చర్చించారు. ఈ సమావేశానికి 14 ఆటో యూనియన్ సంఘాల ప్రతినిధులు హాజరయ్యారు.
ఇది కూడా చదవండి: BJP: అధ్యక్షుల మార్పు.. బీజేపీ కీలక నిర్ణయం!
సంక్షేమ బోర్డు ఏర్పాటు..
తాము ఎదురుకుంటున్న సమస్యలను మంత్రి పొన్నం ప్రభాకర్ కు వివరించారు ఆటో యూనియన్ సభ్యులు. వారి సమస్యలు విన్న మంత్రి పొన్నం త్వరలో ఆటో కార్మికుల సంక్షేమ బోర్డును ఏర్పటు చేస్తామని హామీ ఇచ్చారు. నెల రోజుల్లో వారి సమస్యలను పరిష్కరిస్తామని అన్నారు. ఓలా, ఉబెర్ తరహాలో యాప్ ను తీసుకొస్తామని అన్నారు.
ఎందుకు ఈ చర్చలు.. ?
మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకాన్ని ఆటో డ్రైవర్లు (Auto Drivers) తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. మహిళలకు బస్సుల్లో ఉచిత ప్రయాణం కలిపించడం వల్ల తమకు గిరాకీ తగ్గుతుందని.. ఆటోలో ఎవరు ఎక్కడం లేదని.. దీని వల్ల తమకు ఆదాయం తగ్గుతుందని అవేదం వ్యక్తం చేస్తున్నారు. ఈ పథకం తమకు శాపంగా మారిందని.. దీని ద్వారా తమ కుటుంబాలు రోడ్లపైకి వస్తాయని..ప్రభుత్వంపై ఫైర్ అవుతున్నారు. ఈ క్రమంలో దశలవారీగా తెలంగాణ వ్యాప్తంగా ఆందోళనలు పిలుపునిచ్చాయి ఆటో సంఘాలు. రోజుకు రూ.వెయ్యి ఆదాయం చూపాలంటు ఆటోడ్రైవర్లు ఆందోళనలు చేస్తున్నారు.
ఆటో డ్రైవర్లకు ఏడాదికి రూ.12వేలు…
ఇదిలా ఉండగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకముందు అంటే ఎన్నికల సమయంలో ఆటో డ్రైవర్లను ఆదుకుంటామని తెలిపింది. వారికి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఏడాదికి రూ.12000 ఆర్థిక సాయాన్ని అందిస్తామని హామీ ఇచ్చింది. ఈ విషయాన్ని తమ ఎన్నికల మేనిఫెస్టోలో కాంగ్రెస్ పోందుపర్చింది. తాజాగా ఈ పథకంపై రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తున్నట్లు సమాచారం.
ఆటోడ్రైవర్లకు ఆర్థిక సాయం పథకంపై విధివిధానాలు రూపొందించాలంటుంది ప్రభుత్వం. ఎవరెవరికి ఈ స్కీమ్ వర్తించాలనే దానిపై చర్చలు కొనసాగుతున్నాయి. ఆటో ఓనర్లుకు ఇవ్వాలా.. ఆటో డ్రైవర్లకు ఇవ్వాలా అనే దానిపై ఇంకా క్లారిటీ రానున్నట్లు తెలుస్తోంది. చాలా మంది ఆటోలను అద్దెకు ఇస్తున్నట్లు ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. ఓనర్లకు ఇస్తే తమ పరిస్థితి ఏంటని డ్రైవర్లు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు.
డ్రైవర్లకు ఇస్తే ఆటో కొన్న తమ పరిస్థితి ఏంటని ఓనర్లు ప్రశ్నిస్తున్నారు. అయితే, ముందుగా దరఖాస్తులు స్వీకరించి ఏప్రిల్ నుంచి ఈ స్కీమ్ అమలు చేసే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. లోక్‌సభ ఎన్నికలకు ముందే ఈ పథకంపై ప్రకటన చేసే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
ఇది కూడా చదవండి: AP Elections: ఏపీ ఎన్నికలు.. సీఎం జగన్ కీలక నిర్ణయం!
DO WATCH: