TS ELECTIONS: తెలంగాణలో ఈసారి ఎలాగైనా అధికారం దక్కించుకునేందుకు కాంగ్రెస్ వ్యూహాలు రచిస్తోంది. ఈ నేపథ్యంలో సొంత సర్వేల ప్రకారం గెలిచే అవకాశం ఉన్న అభ్యర్థులకే టికెట్ కేటాయిస్తుంది కాంగ్రెస్ అధిష్టానం. ఈ తరుణంలో టికెట్ ఆశించిన వారికి టికెట్ రాకపోవడం కొందరు నేతలు పార్టీకి రాజీనామా చేస్తున్నారు. మరికొందరు తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి(Revanth Reddy) టికెట్లు అమ్ముకుంటున్నాడని సంచలన ఆరోపణలు చేస్తున్నారు. రేవంత్ రెడ్డి మాత్రం ఆ ఆరోపణలను ఖండిస్తున్నారు.
Also Read: భారీగా పెరిగిన రాజాసింగ్ ఆస్తులు.. ఎంతంటే?
ఫైనల్ లిస్ట్.. సర్వత్రా ఉత్కంఠ:
కాంగ్రెస్‌లో టికెట్ల పంచాయతీ ఇంకా కొలిక్కి రాలేదు. అసెంబ్లీ ఎన్నికల బరిలో దిగుతున్న అబ్యర్థుల జాబితాను కాంగ్రెస్ పూర్తిగా ప్రకటించలేదు. 119 స్థానాలకు గాను.. 100మంది అభ్యర్థులను 55 మందితో ఫస్ట్ లిస్ట్, 45మందితో సెకండ్ లిస్టులను కాంగ్రెస్ ప్రకటించింది. మిగితా 19 స్థానాల్లో పోటీ చేసే అభ్యర్థుల జాబితాపై కాంగ్రెస్ కసరత్తు చేస్తోంది. దీనిపై మరో రెండ్రోజుల్లో స్పష్టత రానున్నట్లు సమాచారం.
Also Read: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడబోతోంది: KTR
నల్లగొండ జిల్లాలో ఆ 3స్థానాలపై రగడ:
నల్లగొండ జిల్లాలో పెండింగ్‌లో ఉన్న 3 స్థానాలపై కాంగ్రెస్‌లో సస్పెన్స్ కొనసాగుతుంది. సూర్యాపేట, తుంగతుర్తి, మిర్యాలగూడ స్థానాలపై నేతల మధ్య ఒప్పందం కొలిక్కి రావడం లేదు.
* మిర్యాలగూడ అభ్యర్థిని సీపీఎం ప్రకటించడంతో కాంగ్రెస్ అభ్యర్థిగా బత్తుల లక్ష్మారెడ్డి(BLR)కి లైన్ క్లియర్ అయినట్లు తెలుస్తోంది.
* సూర్యాపేటలో కాంగ్రెస్ తరఫున బరిలో దిగేందుకు రెడీగా ఉన్నట్లు రాంరెడీ దామోదర్ రెడ్డి, పటేల్ రమేష్ రెడ్డిల పేర్లు వినిపిస్తున్నాయి. దామోదర్ రెడ్డికి ఉత్తమ్ కుమార్ రెడ్డి, జానారెడ్డి తమ మద్దతు ప్రకటించగా.. పొంగులేటి, రేవంత్ రెడ్డి మాత్రం పటేల్ రమేష్ రెడ్డికి తమ మద్దతు ప్రకటించినట్లు గాంధీ భవన్‌లో టాక్ వినిపిస్తోంది. సూర్యాపేటపై నేతల మధ్య ఏకాభిప్రాయం కుదరకపోవడంతో కాంగ్రెస్ అధిష్టానం ఎటు తేల్చుకోలేక పోతుంది.
* తుంగతుర్తిలో అద్దంకి దయాకర్, మోత్కుపల్లి, మందుల సామెల్ ప్రధాన పోటీలో ఉన్నారు. కానీ, కాంగ్రెస్ అధిష్టానం మాత్రం అద్దంకి దయాకర్ వైపు మొగ్గు చూపుతున్నట్లు సమాచారం. మరి ఈ సీట్లపై కాంగ్రెస్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుదనేది వేచి చూడాలి.