హైదరాబాద్ గచ్చిబౌలీలోని ఎల్లా హోటల్ లో ఏర్పాటు చేసిన సీఎల్పీ సమావేశం ముగిసింది. సీల్పీ నేత ఎంపికను ఏఐసీసీ అధ్యక్షుడు మల్లి కార్జున ఖర్గేకు అప్పగిస్తూ తీర్మానం చేసినట్లు డీకే శివకుమార్ వెల్లడించారు. కాగా ఈ ఏక వ్యాఖ్య తీర్మానాన్ని రేవంత్ రెడ్డి ప్రవేశపెట్టగా తుమ్మల నాగేశ్వర రావు రేవంత్ తీర్మానాన్ని బలపరిచారు. దీంతో ఈ రోజే ముఖ్యమంత్రి ఎవరనే విషయంపై మరింత ఉత్కంఠ పెరిగింది. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలతో ఏఐసీసీ పరిశీలకులు సమావేశమవగా సీఎల్పీ నేత ఎంపికకు ఎమ్మెల్యేల అభిప్రాయాలను తెలుసుకుని వారి అభిప్రాయాలతో కూడిన నివేదికను అధిష్ఠానానికి పంపనున్నారు. ఆ తర్వాత కాంగ్రెస్ అధిష్ఠానం సీఎల్పీ నేత ఎంపికపై నిర్ణయం తీసుకోనుంది.
Also read : Election Guarantees: హామీలు.. గ్యారెంటీలే నాలుగు రాష్ట్రాల ఎన్నికల్లో ప్రభావం చూపించాయా?