Telangana Congress: పొంగులేటికి భారీ షాక్.. ఆయనతో పాటు అనుచరుడి సీటు కూడా గల్లంతు!

పొంగులేటి శ్రీనివాసరెడ్డికి గట్టి షాక్ తగిలే అవకాశం కనిపిస్తోంది. ఆయన టికెట్ ఆశిస్తున్న కొత్తగూడెం సీటును సీపీఐకి ఇచ్చి ఆయనను ఖమ్మం నుంచి పోటీకి దించాలని కాంగ్రెస్ హైమాండ్ భావిస్తున్నట్లు సమాచారం. ఆయన ప్రధాన అనుచరుడు పాయం వెంకటేశ్వర్లుకు కూడా పినపాక టికెట్ దక్కే అవకాశం కనిపించడం లేదు.

New Update
Telangana Congress: పొంగులేటికి భారీ షాక్.. ఆయనతో పాటు అనుచరుడి సీటు కూడా గల్లంతు!

పొంగులేటి శ్రీనివాసరెడ్డికి (Ponguleti Srinivasa Reddy) కాంగ్రెస్‌ హైకమాండ్ షాక్ ఇవ్వడానికి సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఓ వైపు 15 సీట్లను తాను ప్రతిపాదించిన వారికి ఇవ్వాలని ఆయన ప్రయత్నాలు చేస్తుంటే.. ఏకంగా ఆయన సీటుకే ఎసరు పెట్టింది హైకమాండ్. పొంగులేటి పోటీకి సిద్ధం అవుతున్న ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని కొత్తగూడెం అసెంబ్లీ స్థానాన్ని పొత్తుల్లో భాగంగా సీపీఐకి ఇచ్చేందుకు కాంగ్రెస్ పార్టీ సిద్ధం అవుతున్నట్లు సమాచారం. ఖమ్మం అసెంబ్లీ స్థానం నుంచి పొంగులేటిని పోటీ చేయించాలన్నది కాంగ్రెస్ హైకమండ్ ఆలోచనగా తెలుస్తోంది. కాంగ్రెస్ తో సీపీఐ, సీపీఎం పొత్తు దాదాపుగా కుదిరినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ రెండు పార్టీలకు చెరో రెండు సీట్లు ఇచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం.
ఇది కూడా చదవండి: CM KCR: ఇక రంగంలోకి కేసీఆర్.. సెంటిమెంట్ గా అక్కడ తొలి మీటింగ్!

సీపీఐకి కొత్తగూడెం, ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని మునుగోడు అసెంబ్లీ స్థానాలను కేటాయించే ఛాన్స్‌ ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. సీపీఎంకు ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని భద్రాచలం, ఉమ్మడి నల్లగొండలోని మిర్యాలగూడ అసెంబ్లీ స్థానాలు ఇచ్చే అవకాశం ఉందని సమాచారం. అయితే.. భద్రాచలం కాంగ్రెస్ సిట్టింగ్‌ ఎమ్మెల్యే పొదెం వీరయ్య పరిస్థితి ఏంటన్నది కూడా ప్రశ్నార్థకంగా మారింది. భద్రాచలం సీటు సీపీఎంకు కేటాయిస్తే పోదెం వీరయ్యను పినపాకకు పంపించే అవకాశం ఉందని తెలుస్తోంది.
ఇది కూడా చదవండి: Revanth Reddy: డిసెంబర్ లో అద్భుతం.. ఆ రోజున రాష్ట్రానికి విముక్తి: రేవంత్ రెడ్డి

ఇలా జరిగితే పొంగులేటి శ్రీనివాసరెడ్డికి మరో షాక్ తగిలే అవకాశం ఉంది. పినపాక సీటును పోదెం వీరయ్యకు ఇస్తే పొంగులేటి ప్రధాన అనుచరుడైన మాజీ ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు కూడా పోటీకి దూరంగా ఉండే పరిస్థితి ఏర్పడుతుంది. ఈ ప్రతిపాదనకు పొంగులేటి ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించే ప్రసక్తి ఉండదని ఆయన అనుచరులు చెబుతున్నారు.

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు