Telangana Congress: టిక్కెట్లు ఇవ్వకుంటే ఏం చేద్దాం?.. భగ్గుమంటున్న కాంగ్రెస్ బీసీ లీడర్లు

కాంగ్రెస్ పార్టీ బీసీ నేతలు అధిష్టానంపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నట్లు తెలుస్తోంది. బీసీలకు సరైన సంఖ్యలో టిక్కెట్లు ఇవ్వకుంటే ఏం చేద్దాం అని బీసీ నాయకుల అంతర్మధనం పడుతున్నట్లు సమాచారం.

Telangana Congress: టిక్కెట్లు ఇవ్వకుంటే ఏం చేద్దాం?.. భగ్గుమంటున్న కాంగ్రెస్ బీసీ లీడర్లు
New Update

తెలంగాణ కాంగ్రెస్ కు (Telangana Congress) కొత్త చిక్కులు వచ్చి పడ్డాయి. తమను పట్టించుకోవడం లేదని ఆ పార్టీ బీసీ నేతలు అధిష్టానంపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నట్లు తెలుస్తోంది. బీసీలకు సరైన సంఖ్యలో టిక్కెట్లు ఇవ్వకుంటే ఏం చేద్దాం అని బీసీ నాయకుల అంతర్మధనం పడుతున్నట్లు సమాచారం. ఇప్పటికే కమ్మ నాయకులకు, రేణుకా చౌదరికి రాహుల్, సోనియా గాంధీ అపాయింట్మెంట్ ఇచ్చి తమకు ఇవ్వకపోవడంపై వారు రగిలిపోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీలో బీసీలను రెడ్డీలే అడ్డుకుంటున్నారని బీసీ నాయకుల అంతర్గతంగా చర్చిస్తున్నారు. రాహుల్ గాంధీకి (Rahul Gandhi) అత్యంత సన్నిహితుగా పేరున్న మధుయాష్కీ గౌడ్ కే (Madhu Yashki Goud) టికెట్ రాకుండా కుట్ర జరుగుతోందన్న ప్రచారం సాగుతోంది. బీసీలకు టిక్కెట్లు ఇవ్వకుంటే కాంగ్రెస్ అధికారంలోకి రావడం కష్టమే అని బీసీ నాయకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో బీసీ నాయకుల విషయంపై ఎలా స్పందిస్తుంది.. వారిని ఎలా సంతృప్తి పరుస్తుందనే అంశంపై జోరుగా చర్చ సాగుతోంది.
ఇది కూడా చదవండి: Telangana BJP: తెలంగాణలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం.. కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీకి కోవర్ట్: మురళీధర్ రావు

ఇదిలా ఉంటే.. తెలంగాణపై పూర్తి ఫోకస్ పెట్టిన కాంగ్రెస్ పార్టీ ఈసారి ఎలాగైన అధికారం చేపట్టాలన్న వ్యూహంతో ముందుకు సాగుతోంది. ఇందులో భాగంగానే రాహుల్ గాంధీ నేరుగా రంగంలోకి దిగుతున్నారు. ఇప్పటికే రెండు సార్లు రాష్ట్రానికి వచ్చిన రాహుల్ మరోమారు ఈనెలలో పర్యటించనున్నారు. ఈ నెల 17న తెలంగాణ కు ప్రియాంక, రాహుల్ రానున్నారు. 17న నిజామాబాద్ లో మహిళా డిక్లరేషన్ చేయనున్నారు. కాంగ్రెస్ ఈ సారి ఎలక్షన్ లో మహిళల ఓట్లే కీలకమని భావిస్తోంది.

అందుకే దాని మీద ఫోకస్ పెట్టింది. కర్ణాటకలో కూడా ఇదే స్ట్రాటజీ ఫాలో అయింది కాంగ్రెస్. అప్పుడు కూడా మహిళా ఓటర్లకు గాలం వేసి గెలిచింది. ఇప్పుడు తెలంగాణలో కూడా అదే చేయాలనుకుంటోంది. అందులో భాగంగా దసరా పండుగ, బతుకమ్మ రోజునే మహిళా డిక్లరేషన్ ఎనౌన్స్ చేయాలని భావిస్తోంది. 6 గ్యారంటీలకు అదనంగా ఇంకా కొత్త పథకాలు ప్రకటించనుంది.

#telangana-election-2023 #congress-party #tpcc
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe