TS News : కేంద్ర ప్రభుత్వం, ప్రధాని మోడీ(PM Modi) పై తెలంగాణ(Telangana) ముఖ్యమంత్రి రేవంత్(CM Revanth Reddy) తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. బీజేపీ ఈ పదేళ్ల అధికారంలో తెలంగాణకు ఇచ్చిందేమీ లేదన్నారు. ఈ మేరకు లోక్ సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్(Congress) మంగళవారం జమ్మికుంటలో జనజాతర పేరిట బహిరంగా సభ నిర్వహించింది. ఈ సందర్భంగా మాట్లాడిన రేవంత్.. తెలంగాణకు గాడిద గుడ్డు, ఏపీకి మట్టి, కర్నాటకకు ఖాళీ చెంబు ఇచ్చారంటూ తనదైన స్టైల్ లో విమర్శలు గుప్పించారు.
ఇది కూడా చదవండి: PM Modi: మాదిగలకు ప్రధాని మోడీ కీలక హామీ.. తప్పకుండా అది అమలు చేస్తామంటూ!
దేవుడి పేరుతో ఓట్లు అడుక్కునే దిక్కుమాలిన స్థితి..
‘బీజేపీ మాయ మాటలతో తెలంగాణను వంచిస్తోంది. దేవుడి పేరుతో ఓట్లు అడుక్కునే దిక్కుమాలిన స్థితికి బీజేపీ చేరుకుంది. రాజకీయ అవసరాల కోసం బీజేపీ రాముడిని కూడా వదిలిపెట్టలేదు. మొన్న జరిగిన అసెంబ్లీ ఎలక్షన్ సెమీ ఫైనల్. సెమీస్లో కేసీఆర్ను చిత్తుచిత్తుగా ఓడించారు. ఇప్పుడు ఫైనల్లో ప్రధాని మోడీని ఓడించాల్సిన బాధ్యత తెలంగాణ ప్రజలపై ఉంది. కరీంనగర్ ఎంపీగా ఉన్న బండి సంజయ్ ఐదేళ్లలో కేంద్రం నుంచి తెలంగాణకు తెచ్చిందేమి లేదు. తెలంగాణను పార్లమెంట్లో ప్రధాని మోడీ అవమానించారు. ఆ సమయంలో బండి సంజయ్ సభలోనే ఉన్నా.. మోడీ అవమానిస్తుంటే చూస్తూ కుర్చుకున్నారు తప్ప ఏమి అనలేకపోయాడు’ అంటూ మండిపడ్డారు.