Revanth Reddy : రేవంత్ రెడ్డి రాజీనామా!.. రాహుల్ గాంధీతో భేటీ, కేబినెట్ కూర్పుపై చర్చ

కేబినెట్ కూర్పుతో పాటు కీలక అంశాలపై చర్చించేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్లారు. మల్కాజిగిరి ఎంపీ పదవికి రాజీనామా చేయడంతో పాటు మరిన్ని ముఖ్యమైన అంశాలపై ఆయన ఢిల్లీ పెద్దలతో చర్చించారు.

Revanth Reddy : రేవంత్ రెడ్డి రాజీనామా!.. రాహుల్ గాంధీతో భేటీ, కేబినెట్ కూర్పుపై చర్చ
New Update

Discussion Of Revanth Reddy Resignation : కేబినెట్ కూర్పుతో పాటు కీలక అంశాలపై చర్చించేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఢిల్లీ వెళ్లారు. మల్కాజిగిరి ఎంపీ పదవికి రాజీనామా చేయడంతో పాటు మరిన్ని ముఖ్యమైన అంశాలపై ఆయన ఢిల్లీ పెద్దలతో చర్చించారు. లోకసభ స్పీకర్ ను కలిసిన రేవంత్ ఎంపీ పదవికి రాజీనామా సమర్పించారు. శనివారం జరగనున్న అసెంబ్లీ సమావేశాల్లో మంత్రులకు శాఖల కేటాయింపు, మిగతా సభ్యుల ప్రమాణ స్వీకారాల నేపథ్యంలో రేవంత్ ఢిల్లీ పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వ ఏర్పాటు తర్వాత జరగబోతున్న తొలి అసెంబ్లీ సమావేశాలివి. రేవంత్ సహా 11 మంది మంత్రులు గురువారం ప్రమాణ స్వీకారం చేసినా, ఎవరికీ ఇంకా శాఖలు కేటాయించలేదు. ఈ విషయమై రాహుల్ గాంధీతో రేవంత్ చర్చించారు.

ఇది కూడా చదవండి: అక్బరుద్దీన్ ఉంటే నేను ప్రమాణస్వీకారం చేయను.. రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు

ప్రమాణ స్వీకారం చేసిన మంత్రులకు శాఖల కేటాయింపుతో పాటు, మిగతా 6 మంత్రి పదవులూ ఎవరికివ్వాలన్న అంశంపై సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ(Delhi) లో అధిష్టానంతో చర్చించారు. శుక్రవారం రాత్రి లోగా ఆయా అంశాలపై ఓ స్పష్ట వస్తుందని తెలుస్తోంది.

వివేక్ వెంకటస్వామి, సుదర్శనరెడ్డి, ప్రేమ్ సాగర్ రావు, మదన్ మోహన్, మల్ రెడ్డి రంగారెడ్డి, కూనంనేని వంటి వారు మంత్రి పదవుల కోసం వేచిచూస్తున్న నేపథ్యంలో, వారిలో ఎవరిని మంత్రి పదవి వరిస్తుందో చూడాలి.

ప్రజా దర్బార్..

మరోవైపు శుక్రవారం ప్రారంభించిన ప్రజాదర్బార్ విజయవంతంగా కొనసాగుతోంది. దీనిని ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి కొద్దిసేపు అక్కడే ఉండి ప్రజల సమస్యలు విన్నారు. వారి నుంచి వినతిపత్రాలను స్వీకరించారు. సీఎం రేవంత్ వెళ్ళిన తరువాత ఆ బాధ్యతను మంత్రి సీతక్క తీసుకున్నారు.

#discussion-of-revanth-reddy-resignation #revanth-reddy-delhi-tour #delhi #cm-revanth-reddy
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe