CM Revanth Reddy: బాధ్యత లేదా?: టాలీవుడ్ కు రేవంత్ రెడ్డి చురకలు

ఎన్ని వందల కోట్ల బడ్జెట్ సినిమా అయినా.. సైబర్ క్రైమ్, డ్రగ్స్‌పై అవగాహన వీడియోలను సినిమాకు ముందు ప్రదర్శించాలని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. టికెట్ రేట్లు పెంచుకోవడం కాదు.. సామాజిక బాధ్యత ఉండాలన్నారు.

CM Revanth Reddy: బాధ్యత లేదా?: టాలీవుడ్ కు రేవంత్ రెడ్డి చురకలు
New Update

Tollywood: టికెట్ రేట్లు పెంచుకోవడం కాదు.. సామాజిక బాధ్యత ఉండాలంటూ టాలీవుడ్‌ కు తెలంగాణ సీఎం రేవంత్ (CM Revanth Reddy) చురకలు అంటించారు. ఈ రోజు సైబర్ సెక్యూరిటీ బ్యూరో, నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో నూతన వాహన శ్రేణి ప్రారంభోత్సవ సభలో రేవంత్ మాట్లాడుతూ.. సైబర్ క్రైమ్ , డ్రగ్స్‌పై సినిమాల్లో అవగాహన (Awareness Against Drugs) కల్పించాలన్నారు. వందల కోట్ల బడ్జెట్ సినిమా అయినా సైబర్ క్రైమ్ , డ్రగ్స్‌ నియంత్రణపై అవగాహన వీడియోలను సినిమాకు ముందు ప్రదర్శించాలన్నారు.

సినిమా రిలీజ్‌కు ముందే అందులో నటించిన నటీనటులు డ్రగ్స్‌కు వ్యతిరేకంగా వీడియో చేయాలన్నారు. అలా చేయకపోతే వారి సినిమాలకు టికెట్లు పెంచే ప్రసక్తి లేదని స్పష్టం చేశారు. అలాంటి నిర్మాతలు, దర్శకులు, నటులకు ప్రభుత్వ సహకారాలు ఉండవన్నారు. సినిమా థియేటర్ల యాజమాన్యాలు కూడా ఇందుకు సహకరించాలన్నారు. డ్రగ్స్‌కు వ్యతిరేకంగా వీడియో సందేశం పంపిన మెగాస్టార్ చిరంజీవికి రేవంత్ రెడ్డి ప్రత్యేక అభినందనలు తెలిపారు.

Also Read: మరో 2 వారాల్లో జాబ్ క్యాలెండర్.. నిరుద్యోగులకు కలిగే ప్రయోజనమిదే!

#drugs #cm-revanth-reddy #tollywood
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe