Dharani Portal: ధరణి పోర్టల్‌పై ముగిసిన సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష..

ధరణి పోర్టల్‌పై సీఎం రేవంత్ రెడ్డి చేపట్టిన సమీక్షా సమావేశం ముగిసింది. ఈ సమావేశంలో ధరణి పోర్టల్‌పై కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ధరణి సమస్యల పరిష్కారానికి ప్రత్యేక కమిటీ వేయాలని భావిస్తోంది ప్రభుత్వం.

New Update
Dharani Portal: ధరణి పోర్టల్‌పై ముగిసిన సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష..

Dharani Portal: ధరణి పోర్టల్‌పై సీఎం రేవంత్ రెడ్డి చేపట్టిన సమీక్షా సమావేశం ముగిసింది. ఈ సమావేశంలో ధరణి పోర్టల్‌పై కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ధరణి పోర్టల్‌లోని సమస్యల పరిష్కారానికి కమిటీ వేయాలని ఆలోచిస్తుంది ప్రభుత్వం. అంతేకాదు.. రెవెన్యూ సంబంధిత అంశాలపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు నెలకు ఒకసారి మండల కేంద్రంలో రెవెన్యూ సదస్సులు నిర్వహించాలని అధికారులను ఆదేశించారు సీఎం రేవంత్ రెడ్డి. ఇదే సమయంలో రెవెన్యూ డిపార్ట్‌మెంట్‌లో ఉద్యోగాల భర్తీపై నిర్ణయం తీసుకున్నారు. త్వరలోనే ఇందుకు సంబంధించి ఒక ప్రకటన వెలువడే అవకాశం కనిపిస్తోంది. కాగా, తెలంగాణలో గత ప్రభుత్వం తీసుకువచ్చిన ధరణి పోర్టల్‌పై సంబంధిత శాఖ అధికారులతో బుధవారం సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ధరణిపై సీఎం సమావేశంలో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, దామోదర రాజనరసింహ, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు. ఎన్నికల సమయంలో తాము అధికారంలోకి వస్తే ధరణి పోర్టల్‌ను రద్దు చేస్తామని రేవంత్ రెడ్డి ప్రకటించిన విషయం తెలిసిందే. మరి ఇప్పుడు ధరణి విషయంలో ఆయన ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది ఉత్కంఠగా మారింది.


Also Read:

తెలంగాణ శాసనసభ స్పీకర్‌గా గడ్డం ప్రసాద్‌

ధరణిలో ప్రధాన ప్రాబ్లెమ్స్ ఇవే.. సీఎం రేవంత్ చేసే మార్పులేంటి?

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు