Sai Dharam Tej: చిన్నపిల్లల పై లైంగిక జోకులు.. సాయి ధరమ్ తేజ్ ఫైర్... రేవంత్ రియాక్షన్..!

సోషల్ మీడియాలో చిన్నారులను అబ్యూస్ చేస్తున్న వారి పై కఠిన చర్యలు తీసుకోవాలని హీరో సాయి ధరమ్ తేజ్ పోస్ట్ పెట్టారు. ఈ పోస్ట్ పై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. పిల్లల ఫొటోలు, వీడియోల దుర్వినియోగం నిరోధించడానికి అవసరమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

New Update
Telangana: సాయి ధరమ్‌ తేజ్‌ ట్వీట్‌ పై స్పందించిన టీజీ డీజీపీ!

Sai Dharam Tej: ప్రస్తుత డిజిటల్ యుగంలో సోషల్ మీడియా వినియోగం విపరీతంగా పెరిగిపోయింది. కొంత మంది సోషల్ మీడియాను మంచి కోసం ఉపయోగిస్తే.. మరికొంత మంది ట్రోలింగ్ అనే పేరుతో ఇతరుల మనోభావాలను దెబ్బతీయడానికి ఉపయోగిస్తుంటారు. అసభ్యకరమైన కామెంట్లు, పోస్టులతో ఎదుటివారి పట్ల నీచంగా వ్యవహరిస్తున్న సంఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. చిన్న పిల్లలను సైతం ఫన్ అనే పేరుతో ట్రోలింగ్ చేస్తుంటారు కొంతమంది సోషల్ మీడియా మృగాలు.

స్పందించిన సాయి ధరమ్ తేజ్ 

తాజాగా నటుడు సాయి ధరమ్ ఇలాంటి ఒక వీడియో పై స్పందించారు. ఫ‌నుమంతు అనే ఛానెల్ రన్ చేస్తున్న ఒక యూట్యూబర్ త‌న ఛాన‌ల్‌లో త‌న ఫ్రెండ్స్‌తో క‌లిసి వీడియోలకు రియాక్షన్స్ ఇవ్వడం, వాటి పై కామెంట్లు, ఫన్ చేయడం చేస్తుంటారు. అయితే ఇటీవలే ఈ యూట్యూబర్ తన ఫ్రెండ్స్ తో కలిసి తండ్రి, తన చిన్నారితో ఉన్న వీడియోపై అసభ్యకరమైన కామెంట్స్ చేస్తూ ఫన్ చేశారు. ఆ తండ్రి, కూతురు వీడియో పై లైంగిక వ్యాఖ్యలు, జోక్‌లు వేస్తూ మాట్లాడారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజ‌న్ల‌తో పాటు టాలీవుడ్ న‌టుడు సాయి ధ‌ర‌మ్ తేజ్ ఎక్స్ వేదిక‌గా స్పందించాడు.

సాయి ధరమ్ తేజ్ పోస్ట్ 

నటుడు సాయి ధరమ్ తేజ్ ఎక్స్ వేదికగా స్పందిస్తూ.. "ఇది భయంకరమైనది, అసహ్యకరమైనది, భయానకమైనది. ఫన్ అనే మారువేషంలో సోషల్ మీడియాలో పిల్లలను అబ్యూస్ చేసే ఇలాంటి రాక్షసులను గుర్తించలేకపోతున్నాము. పిల్లల భద్రత చాలా ముఖ్యం. భవిష్యత్తులో ఇలాంటి భయంకరమైన చర్యలను అరికట్టేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కను కోరారు."

స్పందించిన ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి,

ఇక సాయి ధరమ్ తేజ్ పోస్ట్ పై ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి స్పందించారు. "ఈ క్లిష్టమైన సమస్యను ముందుకు తీసుకొచ్చినందుకు సాయి ధరమ్ తేజ్ కు ధన్యవాదాలు తెలిపారు. పిల్లల భద్రత అత్యంత ప్రాధాన్యమని. సోషల్ మీడియా ప్లాట్ ఫార్మ్స్ లో పిల్లల ఫొటోలు, వీడియోల దుర్వినియోగం నిరోధించడానికి తెలంగాణ ప్రభుత్వం అవసరమైన చర్యలు తప్పక తీసుకుంటుందని హామీ ఇచ్చారు. మన పిల్లలకు సురక్షితమైన ఆన్‌లైన్ వాతావరణాన్ని సృష్టించడానికి కలిసి పనిచేద్దామని ముఖ్యమంత్రి తెలిపారు."

Also Read: Raj Tarun: వేరే అమ్మాయితో కూడా.. రాజ్ తరుణ్ రాసలీలలు బయటపెట్టిన లావణ్య..! - Rtvlive.com

#cm-revanth-reddy #child-abuse #hero-sai-dharam-tej
Advertisment
తాజా కథనాలు