New Districts : తెలంగాణ(Telangana) లో మళ్లీ జిల్లాల పునర్‌వ్యవస్థీకరణ అంశం తెరపైకి వచ్చింది. గతంలో బీఆర్ఎస్(BRS) ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొత్త జిల్లాల ఏర్పాటు సరిగా లేదని సీఎం రేవంత్(CM Revanth) అనేక సార్లు అసంతృప్తి వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఉన్నత స్థాయి కమిటీ వేసి జిల్లాలను పునర్‌వ్యవస్థీకరిస్తామని ఆయన గతంలో చెప్పారు. ఒక్కో పార్లమెంట్ నియోజకవర్గాన్ని ఒక్కో జిల్లాగా చేయాలన్నది ప్రభుత్వ ఆలోచనగా తెలుస్తోంది. ఏపీలోనూ ఇదే విధానాన్ని జగన్ సర్కార్(AP Jagan Government) అవలంభించింది.
ఇది కూడా చదవండి : BRS MLC Kavitha : కవితకు ఖైదీ నంబర్ 666.. డల్‌గా మొదటిరోజు
తెలంగాణలోనూ ఇలానే జిల్లాల ఏర్పాటు చేస్తే బాగుంటుందని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న 33 జిల్లాలు 17కు తగ్గే అవకాశం ఉంది. ఈ మేరకు అధికారులతో ప్రభుత్వం కమిటీ ఏర్పాటు చేయనుంది. ఆ కమిటీ క్షేత్ర స్థాయిలో పర్యటించి ప్రజలతోనూ చర్చించనుంది. కమిటీ ఇచ్చే నివేదిక ఆధారంగా ప్రభుత్వం జిల్లాల ఏర్పాటుపై తుది నిర్ణయం తీసుకోనుంది.
గత ప్రభుత్వం జిల్లాను ఇష్టారీతిగా ఏర్పాటు చేసిందని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. ఒక్కో అసెంబ్లీ సెగ్మెంట్ ను రెండు, మూడు జిల్లాల్లో చేర్చిందని మండిపడుతున్నారు. రాజకీయ ప్రయోజనాల కోసం కూడా జిల్లాలను ఓ పద్ధతి లేకుండా విభజించారన్నది కాంగ్రెస్ వాదన. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ సర్కార్ జిల్లాల పునర్విభజనపై ఫోకస్ పెట్టింది.