/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/450552756_1029014885249785_5775598166067536258_n.jpg)
Good News For Unemployed Over Postpone Of Exams : తెలంగాణ (Telangana) లో డీఎస్సీ, గ్రూప్-2, 3 పరీక్షలను (Group - 2, 3 Exams) వాయిదా వేయాలంటూ నిరుద్యోగులు చేస్తున్న ఆందోళనపై సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) స్పందించారు. ఈ రోజు గౌడ కులస్థులకు కాటమయ్య రక్షణ కిట్లను అందించే కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. నియామక పరీక్షల వాయిదాకు సంబంధించి నిరుద్యోగులు మంత్రులను కలిసి తమ సమస్యలు చెప్పాలన్నారు.. ఆ సమస్యలు పరిష్కరించే బాధ్యత తమది అని స్పష్టం చేశారు. డీఎస్సీ, గ్రూప్-2, 3 పరీక్షలను వాయిదా వేయాలని నిరుద్యోగులు చాలా రోజులుగా ఆందోళన చేస్తున్నారు.
టెట్ నిర్వహణ తర్వాత డీఎస్సీ (DSC) కి తగిన సమయం లేదని ఆ నోటిఫికేషన్ కోసం అప్లై చేసుకున్న అభ్యర్థులు చెబుతున్నారు. డీఎస్సీ, గ్రూప్-2, 3 పరీక్షల మధ్య చాలా తక్కువ గ్యాప్ ఉన్న నేపథ్యంలో రెండు పరీక్షలకు అప్లై చేసుకున్న వారు ఇబ్బంది పడతారని వాదిస్తున్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు గ్రూప్-2, 3 పోస్టులను పెంచాలని వారు డిమాండ్ చేస్తున్నారు. అయితే.. ప్రభుత్వం మాత్రం పరీక్షలను వాయిదా వేసే ప్రసక్తే లేదని అనేక సార్లు స్పష్టం చేసింది.
నిన్న సీఎం రేవంత్ రెడ్డి ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ.. పరీక్షలను వాయిదా వేస్తే అభ్యర్థులకే నష్టం జరుగుతుందన్నారు. పరీక్షలకు దరఖాస్తు చేయని వారు.. వాటిని వాయిదా వేయాలని దీక్షలు చేస్తున్నారని మండిపడ్డారు. దీంతో నిరుద్యోగులు నిన్న రాత్రి హైదరాబాద్ లోని అశోక్ నగర్, దిల్ షుఖ్ నగర్ లో ఆందోళన చేపట్టారు. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి తాజాగా చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి.
నిరుద్యోగులకు ఏమైనా సమస్యలు వుంటే మంత్రులను కలవండి నిన్న, మొన్న కొందరు పిల్లలు పరీక్షలు వాయిదా వేయాలని అంటున్నారు పిల్లలు రోడ్డు ఎక్కడం కన్నా ప్రభుత్వం వారి సమస్యలు వినడానికి సిద్ధంగా ఉంది@revanth_anumula #RevanthReddy #unemplyed #exams #postpone #rtvnews #RTV pic.twitter.com/eHcaOKPUO1
— RTV (@RTVnewsnetwork) July 14, 2024
పరీక్షల వాయిదాపై అభ్యర్థుల్లో మళ్లీ ఆశలు చిరుగరించాయి. సీఎం రేవంత్ ప్రకటన మేరకు వారు మంత్రులను అపాయిట్మెంట్ కోరే అవకాశం ఉంది. మంత్రులతో వారేం చర్చిస్తారు? ఇందుకు మంత్రులు ఎలా స్పందిస్తారు? అన్న అంశంపై నిరుద్యోగవర్గాల్లో ఆసక్తి నెలకొంది.
Also Read : ఆ పూరీ జగన్నాథుడే ట్రంప్‌ను రక్షించాడా ?