CM Revanth: తెలంగాణకు మరో సంచలన అధికారి.. రేవంత్ రెడ్డి వ్యూహం అదేనా?

పూరీ జగన్నాథ్, రవితేజ, ఛార్మీ.. ఇలా సినీ ప్రముఖులను డ్రగ్స్ కేసులో స్టేషన్ కు పిలిపించి సంచలనం సృష్టించిన అకున్ సభర్వాల్ ఐపీఎస్ గుర్తున్నారా? కేంద్ర సర్వీసుల్లో ఉన్న ఆ అధికారిని రేవంత్ సర్కార్ మళ్లీ రాష్ట్రానికి పిలిపిస్తోంది. ఎందుకో ఈ ఆర్టికల్ లో చదవండి.

New Update

'తెలంగాణలో డ్రగ్స్ మాట వినబడాలంటే భయపడాలి... డ్రగ్స్ మహమ్మారితో కుటుంబం, వ్యవస్థ నాశనమవుతాయి.. ఉద్యమాలకు కేరాఫ్‌గా ఉన్న తెలంగాణలో దురదృష్టవశాత్తు గల్లీ గల్లీలో డ్రగ్స్ వాడకం విచ్చలవిడిగా పెరిగింది.. డ్రగ్స్ నిర్మూలన కార్యక్రమాల్లో సినిమా పరిశ్రమ కూడా భాగస్వామ్యం కావాలి.. ఇది పాటించిన వారికే ప్రభుత్వ వెసులుబాట్లు, సహకారం అందించాలి..' ఈ మాటలన్నది ఎవరో ఇప్పటికే అర్థమై ఉంటుంది కదా..! తెలంగాణ సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన నాటి నుంచి డ్రగ్స్‌పై రేవంత్‌రెడ్డి ఎంతో శ్రద్ధ వహిస్తున్నారు. ముఖ్యంగా టాలీవుడ్‌పై ఓ కన్నేసి ఉంచారు. సమయం దొరినిప్పుడల్లా టాలీవుడ్‌లోని లోపాలను ఎత్తి చూపుతున్నారు. ఇక ఇదే క్రమంలో మరోసారి డ్రగ్స్‌పై ఉక్కుపాదం మోపేందుకు ప్రత్యేక అడుగు వేశారు. గతంలో టాలీవుడ్ డ్రగ్స్ కేసులో కీలకంగా వ్యవహరించిన IAS అకున్ సబర్వాల్‌ను మరోసారి తెలంగాణకు తీసుకొస్తున్నారు.

తెలంగాణను డ్రగ్స్ ఫ్రీ స్టేట్‌గా..

తెలంగాణలో డ్రగ్స్‌ రక్కసిని పూర్తిగా రూపుమాపేందుకు రేవంత్ రెడ్డి వేగంగా అడుగులు వేస్తున్నారు.  స్మితా సబర్వాల్ భర్త అకున్ సబర్వాల్‌ని తెలంగాణకు తిరిగి తీసుకురావటం వెనుక రేవంత్ రెడ్డి వ్యూహం ఇదేనంటున్నారు విశ్లేషకులు. తెలంగాణను డ్రగ్స్ ఫ్రీ స్టేట్‌గా మార్చాలని నిర్ణయించుకున్న రేవంత్ రెడ్డి.. ఇప్పటికే కఠినమైన ఆదేశాలు జారీ చేశారు. అటు టాలీవుడ్‌ స్టార్లు సైతం ఇప్పటికే డ్రగ్స్‌కు వ్యతిరేకంగా షార్ట్ వీడియోలు చేసి రిలీజ్ చేస్తున్నారు. చిరంజీవి, జూనియర్ ఎన్టీఆర్‌ ఇప్పటికే ఈ తరహా వీడియోలు చేశారు కూడా. మరోవైపు టాలీవుడ్‌ను రేవంత్‌ ప్రత్యేకంగా ఫోకస్ చేసినట్టుగా అర్థమవుతోంది. అయితే ఇది టాలీవుడ్ పెద్దలకు మాత్రం టార్గెట్‌లా అనిపిస్తోందని వారి బిహేవియర్ చూసిన కొందరు అభిప్రాయపడుతున్నారు.

ఇది కూడా చదవండి: TS: రేవంత్ సర్కార్ కు హైకోర్టు బిగ్ షాక్.. మూసీ కూల్చివేతలపై స్టే!

Akun sabharwal smitha sabharwal

ఎన్‌కన్వేషన్‌ కూల్చివేతలతో టాలీవుడ్ లో ప్రకంపనలు..

నాగార్జునకు చెందిన ఎన్‌కన్వేషన్‌ను కూల్చడం టాలీవుడ్‌లో ప్రకంపనలు రేపింది. హైదరాబాద్‌లో చెరువులు, కాలువలపై నిర్మించిన కట్టడాలను హైడ్రా పేరిట రేవంత్‌ సర్కార్‌ కూల్చివేసింది. అందులో నాగార్జున్‌కు చెందిన ఫంక్షన్‌ హాల్‌ ఉండడం రచ్చకు దారి తీసింది. ఆ సమయంలో సినీ పెద్దలంతా మౌనం పాటించారు. ఏ ఒక్కరూ కూడా ప్రభుత్వ చర్యపై మాట్లాడలేదు. ఇక నంది అవార్డ్స్‌ పేరు గద్దర్ అవార్డులగా పేరు మార్చిన నిర్ణయాన్ని కూడా ఇండస్ట్రీ పెద్దలు స్వాగతించినట్టు కనిపించలేదు. అయినా రేవంత్‌ మాత్రం తన పని తాను చేసుకుపోయారు.

ఇది కూడా చదవండి: తెలంగాణలోనే ఉంటాం.. క్యాట్ ను ఆశ్రయించిన ఐఏఎస్ లు!

sabhavarwal ias ips

ఇబ్బంది పెట్టిన సురేఖ వ్యాఖ్యలు..

ఇలా రేవంత్‌ వర్సెస్‌ టాలీవుడ్‌ కోల్డ్‌ వార్‌ జరుగుతున్న సమయంలో కొండాసురేఖ చేసిన వ్యాఖ్యలు రేవంత్‌ను తీవ్రంగా ఇబ్బంది పెట్టాయి. అక్కినేని నాగ చైతన్య-సమంత విడిపోవడానికి కేటీఆర్ కార‌ణ‌మంటూ కొండా సురేఖ చేసిన కామెంట్స్‌పై టాలీవుడ్ మొత్తం భగ్గుమన్నది. అలాగే.. కేటీఆర్ కార‌ణంగా చాలా మంది హీరోయిన్లు తొందరగా పెళ్లి చేసుకుని టాలీవుడ్‌కు దూరంగా వెళ్లిపోయారంటూ ఆమె చేసిన ఆరోప‌ణ‌లను టాలీవుడ్‌ ముక్త కంఠంతో ఖండించింది. 

ఇది కూడా చదవండి: Muthyalamma : అమ్మవారి విగ్రహం ధ్వంసం.. ఆలయం వద్ద పెరిగిన ఉద్రిక్తత

ఒక్కటైన టాలీవుడ్..

ఎన్‌కన్వెన్షన్‌ను కూల్చివేయ‌కుండా ఉండేందుకు బదులుగా సమంతను తన వద్దకు పంపాలని కేటీఆర్ డిమాండ్ చేశార‌ని కొండాసురేఖ ఆరోపించారు. సమంతని తన వద్దకు వెళ్లమని నాగార్జున కోరగా ఆమె వెళ్లేందుకు నిరాకరించిందన్నారు. దీని కార‌ణంగా నాగ చైత‌న్య-స‌మంత విడాకులు తీసుకున్నార‌న్నారు. అయితే సమంతతో పాటు మొత్తం టాలీవుడ్‌ కొండాసురేఖ కామెంట్స్‌పై మండిపడింది. ఈ విషయంపై నాగార్జున ఇప్పటికే కోర్టు తలుపుతట్టారు. ఇక ఈ మొత్తం వ్యవహారంలో టాలీవుడ్‌ స్పందించిన తీరు చూస్తే ఒకటి మాత్రం క్లియర్‌కట్‌గా అర్థమవుతోంది. తమ జోలికి రావద్దంటూ ప్రతీ ఒక్కరూ పరోక్షంగా రేవంత్‌కు వ్యతిరేకంగా రియాక్ట్ అయ్యారు.

ఇది కూడా చదవండి: కొండా సురేఖపై క్రిమినల్ కేసు.. కేటీఆర్ కు కోర్టు కీలక ఆదేశాలు!

డ్రగ్స్ బాబులను ఇబ్బంది పెట్టేందుకే..

అటు రేవంత్‌ మాత్రం ఈ విషయంలో ఆచితూచి వ్యవహరించారు. ఈ విషయాన్ని అసలు పెద్దగా పట్టించుకోనట్టే కనిపించారు. ఇక కొండాసురేఖపై ఇప్పటివరకు ఎలాంటి చర్యలు కూడా తీసుకోలేదు. ఇది టాలీవుడ్‌ పెద్దలకు మరింత కోపం తెచ్చినట్టుగానే అనిపిస్తోంది. సరిగ్గా ఇదే సమయంలో డ్రగ్స్‌పై ఫోకస్ పెంచే విధంగా అకున్‌ సబర్వాల్‌ను తెలంగాణకు తీసుకువస్తుండడం టాలీవుడ్‌ డ్రగ్స్‌ బడాబాబులను ఇరుకున పెట్టేందుకేనన్న ప్రచారం జరుగుతోంది.

#revanth-reddy #drugs-case #akun-sabarwal
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe