CM Revanth Reddy: తెలంగాణ సీఎం రేవంత్ సోమవారం రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌తో (Rajnath Singh) సమావేశమయ్యారు. విభజన హామీల అమలు, ఇతర అంశాల గురించి రేవంత్ చర్చించారు. రక్షణ శాఖ భూముల బదలాయింపు, హైదరాబాద్ లో రోడ్లు, ఎలివేటెడ్ కారిడార్ల నిర్మాణానికి రక్షణ శాఖ భూములు అప్పగించాలని కేంద్రమంత్రిని కోరారు.
పార్లమెంట్ సభ్యుల ప్రమాణస్వీకారం..
ఇక సోమ, మంగళవారం ఢిల్లీలోనే ఉండనున్న రేవంత్.. పార్లమెంట్ సభ్యుల ప్రమాణస్వీకార కార్యక్రమానికి హాజరుకానున్నారు. ఈ క్రమంలోనే ఢిల్లీ పర్యటన ముగిసేలోపు సీఎం రేవంత్ మరికొంతమంది కేంద్రమంత్రులను కలిసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. సాయంత్రం 6.15 గంటలకు గృహ నిర్మాణ శాఖ మంత్రి ఖట్టర్‌తో సీఎం భేటీ కానున్నారు. ముఖ్యమంత్రి వెంట ఉన్న లోక్ సభ ఎంపీలు మల్లు రవి, రఘురామిరెడ్డి,బలరాం నాయక్, సురేష్ షెట్కార్, చామల కిరణ్ కుమార్ రెడ్డి, రఘువీర్ రెడ్డి, కడియం కావ్య, గడ్డం వంశీ, రాజ్యసభ సభ్యుడు అనిల్ కుమార్ యాదవ్ ఉన్నారు.
ఇక ముఖ్యమంగా మంత్రిమండలి విస్తరణ, పీసీసీ అధ్యక్షుడి ఎంపిక తదితర అంశాలపై చర్చించే కాంగ్రెస్ పార్టీ అధిష్థానంతో రేవంత్ చర్చించే అవకాశం ఉంది. పార్లమెంట్‌లో ప్రస్తావించాల్సిన రాష్ట్రానికి చెందిన అంశాలపై ఎంపీలకు సీఎం రేవంత్ దిశానిర్దేశం చేయనున్నారు. లోక్‌సభ ఎన్నికలు ముగిసి పాలనపై పూర్తిస్థాయిలో దృష్టి సారించిన సీఎం రేవంత్ త్వరలోనే మంత్రివర్గం విస్తరించనున్నట్లు సమాచారం.
Also Read: బెంగళూరుకు జగన్.. జోరందుకున్న అక్కడి ప్యాలెస్ పై చర్చ