JNTUH: రాజకీయ శక్తులు, కొన్ని కోచింగ్ సెంటర్ల నిర్వాహకులు మాత్రమే గ్రూప్-2, డీఎస్సీ పరీక్షలు వాయిదా వేయాలంటూ ఆమరణ దీక్షలు చేస్తున్నారని సీఎం రేవంత్ రెడ్డి మండిపడ్డారు. నిరుద్యోగ యువత గత పదేళ్లు ఉద్యోగాల కోసం కొట్లాడింది వాయిదాలు వేయడానికేనా అంటూ ప్రశ్నించారు. పరీక్షలు వాయిదా వేస్తే విద్యార్థులకే తీవ్ర నష్టం జరుగుతుందంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు శనివారం జేఎన్టీయూలో ఇంజనీరింగ్ విద్యపై విద్యాసంస్థల యాజమాన్యాలతో ఇంటరాక్షన్ ఏర్పాటు చేశారు. ఈ సదస్సుకు ముఖ్య అతిథులుగా సీఎం రేవంత్, ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు పాల్గొన్నారు.
పూర్తిగా చదవండి..CM Revanth: జాబ్ క్యాలెండర్ పై రేవంత్ కీలక ప్రకటన.. పరీక్షల వాయిదాలపై ఏమన్నారంటే!
యూపీఎస్సీ తరహాలోనే ప్రతీ ఏటా జాబ్ క్యాలెండర్ ప్రకారం ఉద్యోగాలు భర్తీ చేస్తామని సీఎం రేవంత్ చెప్పారు. రాజకీయ శక్తులు, కొన్ని కోచింగ్ సెంటర్ల నిర్వాహకులే పరీక్షలు వాయిదా వేయాలంటున్నారని మండిపడ్డారు. జేఎన్టీయూలో నిర్వహించిన సదస్సుకు రేవంత్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
Translate this News: