Revanth Reddy: కాసేపట్లో ఢిల్లీకి రేవంత్‌..భట్టి!

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క మరి కాసేపట్లో ఢిల్లీకి బయల్దేరనున్నారు. ఇప్పటికే కాంగ్రెస్‌ పార్టీ 13 లోక్‌సభ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన విషయం తెలిసిందే.

CM Revanth: వారికి మాత్రమే క్యాబినెట్‌లో ఛాన్స్.. రూల్స్ బ్రేక్ చేయదల్చుకోలేదు
New Update

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క మరి కాసేపట్లో ఢిల్లీకి బయల్దేరనున్నారు. ఇప్పటికే కాంగ్రెస్‌ పార్టీ 13 లోక్‌సభ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన విషయం తెలిసిందే. మరో నాలుగు సీట్లు మాత్రమే పెండింగ్ లో ఉన్నాయి. ఈ నాలుగు నియోజవర్గాలకు సంబంధించి అభ్యర్థులను ఫైనల్‌ చేయడానికి రేవంత్‌, భట్టి ఢిల్లీ వెళ్లనున్నారు.

అధిష్టానంతో మాట్లాడి, ఆశావహుల పై చర్చించి అభ్యర్థుల ప్రకటన చేయనున్నారు. పోటీ ఎక్కువగా ఉండటంతో అధిష్టానంతో చర్చించి పేర్లు ఖరారు చేయనున్నారు.

పెండింగ్ లో ఉన్న ఖమ్మం, వరంగల్‌, కరీంనగర్‌, హైదరాబాద్‌ అభ్యర్థుల గురించి అధిష్టానంతో ప్రస్తావించే అవకాశాలున్నాయి. అలాగే, సికింద్రాబాద్ నుంచి దానం నాగేందర్ పోటీ అంశంపై మరోసారి క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉంది. ఖమ్మం ​ అభ్యర్థి ఎంపికపై ఇంకా కొలిక్కిరాని పంచాయితీ. ఏకాభిప్రాయం రాకుంటే పోటీ చేయాలని ప్రియాంకను కోరే ఛాన్స్‌ ఉంది.

ఖమ్మం టికెట్ కోసం పోటీలో ముగ్గురు మంత్రుల ఫ్యామిలీ మెంబర్స్.పోటీలో మంత్రి పొంగులేటి సోదరుడు ప్రసాద్‌ రెడ్డి, ఆయన వియ్యంకుడు రఘురామిరెడ్డి ఉన్నారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సతీమణి నందిని కూడా టికెట్ ఆశిస్తున్నారు. వ్యవసాయ మంత్రి ​ తుమ్మల నాగేశ్వర రావు కుమారుడు యుగంధర్ కూడా టికెట్‌ ఆశిస్తున్నారు. వీరితో పాటు రేసులో ఉన్న ఖమ్మం స్థానిక నేతలు రాజేంద్రప్రసాద్, లోకేశ్‌ యాదవ్‌ ఉన్నారు.

Also read: 238 సార్లు ఓడినా… తగ్గేదేలే… అంటున్న ఎలక్షన్‌ కింగ్‌!

#congress #delhi #revanth-reddy #batti-vikramrka #electons
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe